Begin typing your search above and press return to search.

టాప్ డైరెక్టర్‌ ల జాబితాలో చేరడంతో విల్లా కొనేశాడు?

By:  Tupaki Desk   |   8 March 2021 4:30 AM GMT
టాప్ డైరెక్టర్‌ ల జాబితాలో చేరడంతో విల్లా కొనేశాడు?
X
చేసిన ప్రతి ఒక్క సినిమాను మినిమం గ్యారెంటీ హిట్ అన్నట్లుగా చేసుకుంటూ వెళ్తున్న దర్శకుడు అనీల్ రావిపూడి గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ ఏడాది ఆగస్టులో ఎఫ్‌ 3 తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. వరుసగా హిట్‌ లు అందుకుంటున్న దర్శకుడు అనీల్ రావిపూడి పారితోషికం సినిమా సినిమాకు పెరుగుతూనే ఉంది. పది కోట్లకు పైగానే అందుకుంటున్న దర్శకుడు అనీల్ రావిపూడి ఇప్పటికే టాలీవుడ్ టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ఎఫ్‌ 3 సక్సెస్ అయితే ఈయన పారితోషికంతో పాటు క్రేజ్‌ మరింత పెరగడం ఖాయం. తన స్టార్ డం పెరగడంతో తాను ఉండే ఇళ్లు కూడా మారాలనే ఉద్దేశ్యంతో పెద్ద మొత్తంతో విల్లాను కొనుగోలు చేశాడట.

కొండాపూర్‌ ప్రాంతంలో దాదాపుగా రూ.12.5 కోట్ల విలువ చేసే విల్లాను కొనుగోలు చేసిన అనీల్ రావిపూడి ఇతర ఖర్చులు అన్ని కలిపి రూ.15 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. అత్యంత విలాసవంతమైన ఆ విల్లా ను అనీల్ రావిపూడి స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ తో ఇంటీరియర్ చేయించుకుంటున్నాడట. కొన్ని నెలల క్రితమే కొండాపూర్‌ లో సుకుమార్ విల్లాను కొనుగోలు చేశాడు. ఇప్పుడు కాస్త దగ్గర్లోనే అనీల్‌ కూడా విల్లా కొనుగోలు చేయడం జరిగింది. అలా సుకుమార్ సరసన నిలిచాడు. ఎఫ్‌ 3 సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం స్టార్‌ హీరోతో సినిమాను అనీల్ లైన్ లో పెట్టాడు. దాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాడట.