Begin typing your search above and press return to search.

ఫుల్ స్వింగ్ అంటున్న రావిపూడి

By:  Tupaki Desk   |   3 Aug 2019 8:03 AM GMT
ఫుల్ స్వింగ్ అంటున్న రావిపూడి
X
వరసహిట్లతో జోరుమీదున్న దర్శకుడు అనిల్ రావిపూడికి మొదటిసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబును మొదటిసారిగా డైరెక్ట్ చేసే అవకాశం 'సరిలేరు నీకెవ్వరు' తో లభించింది. తన సినిమాలలో పాత్రలే కాకుండా రియల్ గా కూడా రావిపూడి స్పీడే వేరు. అతితక్కువ సమయంలో స్క్రిప్ట్ పూర్తిచేయడమే కాదు.. షెడ్యూల్స్ కూడా చకాచకా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి మరో అప్డేట్ ఇచ్చాడు రావిపూడి.

తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫోటోను పోస్ట్ చేసిన అనిల్ రావిపూడి "సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. సంక్రాంతి థియేటర్లలో ఒక హిలేరియస్ ట్రైన్ జర్నీని చూడబోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ గారు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కు సిద్ధంగా ఉండండి #సరిలేరు నీకెవ్వరు" అంటూ ట్వీట్ చేశాడు. ఫోటోలో మహేష్ బాబు ట్రైన్ డోర్ ను ఆనుకొని సూపర్ స్టైలిష్ గా నిలబడ్డాడు. వెనుక నుంచి తీసిన ఫోటో కావడంతో సిలౌట్ డిజైన్ తరహాలో సూపర్బ్ గా ఉంది. మహేష్ ఆ నడుము మీద చేయ్యిపెట్టుకున్న స్టైల్ అదిరిపోయింది.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. విజయశాంతి.. ప్రకాష్ రాజ్.. రమ్యకృష్ణ.. రాజేంద్రప్రసాద్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అనిల్ సుంకర.. దిల్ రాజు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.