Begin typing your search above and press return to search.
సెప్టెంబర్ లో:అనిల్, సాయి ధరమ్ ల సినిమా
By: Tupaki Desk | 29 July 2015 12:53 PM ISTసాయి ధరమ్ తేజ్ దిల్ రాజు కాంపౌండ్ నుండి ఇప్పట్లో బయటపడేలా లేడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో నటిస్తున్న ఈ మెగా మేనల్లుడు తర్వాతి సినిమాగా పటాస్ దర్శకుడు అనిల్ రావిపూడితో జత కట్టాడు. ఈ సినిమాని నిర్మిస్తున్నది దిల్ రాజే. కొద్దిరోజుల క్రితమే ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయినా మిగతా వివరాలు తెలియలేదు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో మొదలుకానుంది.
సాయికుమార్, పోసాని కీలక పాత్రల్లో నటిస్తుండగా జయప్రకాశ్ రెడ్డి, ప్రవీణ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి కామెడీ భాద్యతలను తీసుకున్నారు. అందాల బొద్దుగుమ్మ రాశి ఖన్నా ఈ సినిమాతో మెగా హీరోతో జతకడుతోంది. సాయి కార్తీక్ స్వరాలు అందిస్తున్నారు. 2016 సమ్మర్ బరిలో నిలవనున్న ఈ సినిమాకి త్వరలో టైటిల్ ఫిక్స్ చేయనున్నారు. సెప్టెంబర్ 24న సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విడుదల కానుంది.