Begin typing your search above and press return to search.

'రాముల‌మ్మ‌'తో వ‌ర్కింగ్..నెవ‌ర్ బిఫోర్..ఎవ‌ర్ ఆఫ్ట‌ర్ అట‌!

By:  Tupaki Desk   |   29 Feb 2020 11:00 AM GMT
రాముల‌మ్మ‌తో వ‌ర్కింగ్..నెవ‌ర్ బిఫోర్..ఎవ‌ర్ ఆఫ్ట‌ర్ అట‌!
X
అల‌నాటి టాలీవుడ్ అందాల తార‌, లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి చాలా గ్యాప్ త‌ర్వాత `స‌రిలేరు నీకెవ్వ‌క‌రు` చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రాముల‌మ్మ పోషించిన‌ కీల‌క పాత్రకు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. విజ‌య‌శాంతి క‌మ్ బ్యాక్ మూవి లో తాము ప‌ని చేయ‌డం ఆనందం గా ఉంద‌ని ప్రిన్స్, మ‌హేష్ బాబు, ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఎన్నో సార్లు చెప్పారు. తాజాగా మ‌రోసారి విజ‌య‌శాంతిపై అనిల్ రావిపూడి ప్ర‌శంస‌లు కురిపించాడు. విజ‌య‌శాంతితో క‌లిసి ప‌నిచేయ‌డం చిర‌కాలం గుర్తుండిపోయే ఓ అనుభవం అటూ అనిల్ ట్వీట్ చేశారు. తాజాగా `సరిలేరు నీకెవ్వ‌రు`సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భం గా నాటి షూటింగ్ సెట్‌ లో విజ‌య‌శాంతి తో క‌లిసి దిగిన ఫొటోను అనిల్ షేర్ చేశాడు.


స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో విజయశాంతి కోసం ఓ ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్‌ను అనిల్ రావిపూడి క్రియేట్ చేశాడు. ఆ పాత్ర‌లో న‌టించేందుకు విజ‌య‌శాంతిని ఒప్పించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. ఆ సినిమాకు విజ‌య‌శాంతి న‌ట‌న చాలా ప్ల‌స్ అయింది. ఇక తాజాగా ఈ సినిమా హాఫ్ సెంచ‌రీ కొట్టింది. ఈ సంద‌ర్భంగా షూటింగ్ స‌మ‌యంలో లేడీ అమితాబ్ తో దిగిన ఓ ఫొటోను అనిల్ విజ‌య‌శాంతితో కలిసి పని చేయడం చిరకాలం గుర్తుండి పోయే ఓ అనుభవం అని, విజ‌య‌శాంతి రీఎంట్రీ సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్ రావడం త‌న‌కు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అనిల్ ట్వీట్ చేశాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా లో రాముల‌మ్మ‌ నటించిన తీరు నటనా నైపుణ్యాలు శాశ్వతమని నిరూపించిందని అనిల్ ఎమోష‌న‌ల్ గా ట్వీట్ చేశాడు.