Begin typing your search above and press return to search.

బాబోయి బాబాయ్ అల్లరి చూడండి

By:  Tupaki Desk   |   29 July 2017 7:17 AM GMT
బాబోయి బాబాయ్ అల్లరి చూడండి
X
సాధరణంగా ఓకే దగ్గర కొంతమంది కలిసి పనిచేసినప్పుడు అందులోనూ ఎక్కువ సమయం ఓకే దగ్గర ఉండవలిసి వచ్చినప్పుడు అంతా సరదాగా ఓకే కుటంబంలా మెలుగుతూ ఉంటారు. అందరూ పెద్ద చిన్న అనే తేడా లేకుండా సరదాగా ఉంటారు. మరి సినిమా సెట్లలో అటువంటి అల్లరి చేసే వారు, సరదాగా అందరిని నవ్వించే వారు కొదవేం ఉంటుంది చెప్పండి. అర్జున్ కపూర్ హీరోగా ఇలియానా - అతియా శెట్టి - అనిల్ కపూర్ ప్రధాన పాత్రలలో ‘ముబారకన్’ అనే హిందీ సినిమా నిన్ననే విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ లో సీనియర్ నటుడు అంటే కచ్చితంగా అనిల్ కపూరే కదా. ముబారకన్ సెట్ లో ఒకసారి అనిల్ కపూర్ చేసిన పనికి అక్కడ అందరూ షాక్ అయ్యారట.

ఈ సినిమా విడుదలై అబ్బాయి బాబాయి కెమిస్త్రీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సినిమా కూడా బాక్స్ ఆఫీసు వద్ద మంచి ఓపెనింగ్స్ చేసింది. ముబారకన్ సినిమాలో అనిల్ కపూర్ అర్జున్ కపూర్ కామిడీ హైలైట్. సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చినప్పుడు.. అనిల్ కపూర్ మీరు ఇంకా షూటింగ్ కి రావలిసిన పని లేదు కేవలం అర్జున్ కపూర్ ఇలియానా మద్య కొన్ని సీన్లు మాత్రమే భాకి ఉన్నాయి అని చెప్పారు అంటా డైరక్షన్ టీమ్. దానితో అనిల్ కపూర్ ఆ మరుసటి రోజు సెట్ లోకి చాలా కోపంగా వెళ్ళి “నన్ను ఎందుకు రావద్దు అని చెప్పారు. నా సీన్లు ఇంకా మిగిలే ఉన్నాయి కదా'' అని గట్టిగా అందరిని ప్రశ్నించాడు అంటా దానితో అక్కడ ఉన్న అర్జున్ కపూర్ - ఇలియానా కు ఎలా స్పందించాలో తెలియక నోట మాట రాలేదు అంటా. నేను సినిమా ప్రమోషన్ కు కూడా రాను వెళ్తున్నా అన్నాడట. దానితో ప్రొడ్యూసర్ కు కూడా భయం వేసింది. అందరూ కొంచెం సీరియస్ గా మొఖాలు పెట్టేసరికి అరే నేను సరదాగా అన్నాను అని గట్టిగా నవ్వేశాడట అనిల్. దానితో అక్కడ వాతావరణం ఒక్కసారి తేలికపడింది.

ఏదైనా అనిల్ కపూర్ కాబట్టి ఇలాంటి అల్లరి పని చేయగలిగాడు. అనిల్ కపూర్ స్నేహితులు కూడా అనిల్ గురించి ఇలానే చెబుతుంటారు. అనిల్ కామిడీ టైమింగ్ కూడా మనం తన ముందు సినిమాలలో చూసే ఉన్నాం కదా. మొత్తానికి తన అబ్బాయి హీరోగా చేస్తున్న సినిమా షూటింగులో బాబాయ్ అలా బాబోయ్ అనిపించేలా అల్లరి చేశాడనమాట.