Begin typing your search above and press return to search.

ఏడాది వయసప్పుడే హాట్‌ హాట్‌గా...

By:  Tupaki Desk   |   9 Jun 2015 3:59 PM GMT
ఏడాది వయసప్పుడే హాట్‌ హాట్‌గా...
X
కుందనపు బొమ్మ.. పట్టుబొమ్మ.. అందాల ఆడబొమ్మ.. ఇలాంటి పదాలు వేస్తేనే సోనమ్‌ కపూర్‌ రేంజికి సరిపోతుందేమో. క్యూట్‌ లుక్స్‌తో హాట్‌ అప్పియరెన్స్‌తో, అందమైన స్మయిల్‌తో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించుకుంది ఈ అమ్మడు. ధనుష్‌ సరసన రాంజానా సినిమాలో సోనమ్‌ నటించిన తీరు అసాధారణం. అది తమిళ తెలుగు ప్రేక్షకులకు కూడా విపరీతంగా నచ్చిన సినిమా. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూనే అద్భుతమైన ఆహార్యంతో ఆకట్టుకుంది.

ఈ కుందనపు బొమ్మకు ఈరోజే పుట్టినరోజంట! అందుకే ఓ మారు తనని గుర్తు చేసుకోవాల్సొస్తోంది. ప్రస్తుతం సోనమ్‌ బాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ సినిమాల్లో నటిస్తోంది. ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో, నీర్జా బేనట్‌ చిత్రాల్లో నటిస్తూ నిత్యం బిజీ బిజీగా గడిపేస్తోంది. అలాగే ఈ బర్త్‌డే బేబికి తండ్రి అనీల్‌ కపూర్‌తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పాపా ఒడిలోనే అల్లారు ముద్దుగా పెరిగింది. ఆ సంగతిని ఈ ఫోటో చూస్తే ఇట్టే చెప్పేయొచ్చు. అలాగే ఏడాది వయస్సలో కూడా హాట్‌ బేబీగా సోనమ్‌ ముద్దులొలికించేసిందని కూడా చెప్పొచ్చు. ఆగస్ట్‌ 29-సెప్టెంబర్‌ 6, 1986 వీక్లీ మ్యాగజైన్‌ .. స్టార్‌ అండ్‌ స్టయిల్‌ కవర్‌పేజీపై గారాల పట్టీ సోనమ్‌తో కలిసి దిగిన ఫోటో ఇది. సోనమ్‌ 1985లో జన్మించింది. ఎనీవే, హ్యాపీ బర్త్‌డే బేబీ.