Begin typing your search above and press return to search.
పిక్ టాక్‌ః ఈ వయసులోనూ కండలు చూపుతున్న మిస్టర్ ఇండియా
By: Tupaki Desk | 1 Feb 2021 7:41 AM ISTబాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు మిస్టర్ ఇండియా గా పేరు దక్కించుకున్న అనీల్ కపూర్ ఆరున్నర పదుల వయసులో కూడా చాలా ఫిట్ గా మంచి ఫిజిక్ తో కనిపిస్తూ ఉన్నాడు. నాలుగు పదుల వయసు వ్యక్తిగా ఆయన కనిపించడంతో పాటు అదే ఉత్సహంతో ఇప్పటికి సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయన రెగ్యులర్ గా చేసే వర్కౌట్ ల వల్లే ఈ స్థాయిలో హెల్దీగా ఉన్నాడు. ఇక ఆయన ఈ వయసులో కూడా ఫిట్ గా కనిపిస్తూ యూత్ స్టార్స్ కు ఆదర్శంగా నిలుస్తున్నారు అంటూ ఆయనపై ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఈ కండల ప్రదర్శణ ఫొటో మరోసారి అనీల్ కపూర్ రేంజ్ ను చెప్పకనే చెబుతున్నాయి.
ఈ వయసులో కూడా ఈ రేంజ్ లో కండలను మెయింటెన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆరు పదుల వయసు వచ్చిందటే కాటికి కాళ్లు చాచుకుని కూర్చున్నట్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. కాని బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్ మాత్రం ఏడు పదుల వయసు దగ్గరకు వస్తున్నా కూడా ఆయన తీరు మాత్రం మారలేదు. ఆయన పాజిటివ్ థింకింగ్ మరియు ఎనర్జి అద్బుతం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అనీల్ కపూర్ బాలీవుడ్ మూవీ జగ్ జగ్ జీయో సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్ లో ఉన్నాడు. అక్కడే ఇలా వర్కౌట్ లు చేస్తున్నాడు. సన్ డే జిమ్ డే అన్నట్లుగా అనీల్ కపూర్ ఈ ఫొటోలను షేర్ చేశాడు.