Begin typing your search above and press return to search.

డాడీ పక్కనుండగా హాట్ పోజులేంటో

By:  Tupaki Desk   |   5 Nov 2015 5:30 PM GMT
డాడీ పక్కనుండగా హాట్ పోజులేంటో
X
ఈ తరం హీరోయిన్స్ హాట్ గా కనిపించడానికే ఇష్టపడతారు. ముఖ్యంగా ఫోటో సెషన్స్ అయితే వీళ్ల పోజులు మత్తెక్కించేలా ఉంటాయి. అందులోనూ మేగజైన్ కోసం అనుకోండి.. ఈ డోస్ మరింతగా పెరగడం ఖాయం. ఇవన్నీ కాక కవర్ పేజ్ కోసం.. హీరోయిన్లను పట్టుకోవడం.. వాళ్లని కన్నవాడి వల్లకూడా కాదు.

ఇప్పుడదే జరిగింది సోనమ్ కపూర్ విషయంలో. హెలో అనే లైఫ్ స్టైల్ మేగజైన్ కోసం అనిల్ కపూర్ ఫ్యామిలీ మొత్తం ఫోజులిచ్చేశారు. అనిల్ కపూర్ - పెద్దకూతురు రియా కపూర్ - చిన్న కూతురు సోనమ్ కపూర్ లు సూపర్బ్ ఫోటో షూట్ చేశారు. మొత్తం కుటుంబమంతా సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించడం ఈ ఫోటోల స్పెషాలిటీ. మల్టీ ప్యాటర్న్ డ్రస్ లో సోనమ్ కపూర్ - గాగ్రాలో రియా కపూర్ - షేర్వాణీలోలో అనిల్ కపూర్.. భలే ఆకర్షణీయంగా ఉన్నారు. అసలే సాంప్రదాయ దుస్తులు కదా.. అందుకే అనిల్ కపూర్ - రియాలు బాగా పద్ధతిగా ఉన్నారు. కానీ సోనమ్ కపూర్ విషయంలోనే తేడా కొడుతోంది. నాన్న పక్కనున్నా సరే.. ఎక్స్ పోజింగ్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు.

కొన్నాళ్ల క్రితం వెల్ కం బ్యాక్ మూవీ ప్రీమయర్ కి వచ్చినపడు కూడా ఇలాగే క్లీవేజ్ షో చేసింది సోనమ్. మొదట్లో మరీ పద్ధతిగా కనిపించేది. ఇప్పుడేమో పద్ధతులను పట్టించుకోవడం మానేసిందీ సుందరి. ఇలా అయితే ఎలా సోనమ్.. కొన్నింటిని మెయింటెయిన్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి.. కావాలంటే నాన్నని అడుగు. ఇలాంటి విషయాల్లో ఆయన బాగా ఎక్స్ పర్ట్.