Begin typing your search above and press return to search.
బాలయ్య ఫ్యాన్స్ కు అనిల్ హామీ
By: Tupaki Desk | 22 Feb 2022 8:00 AM ISTనందమూరి బాలకృష్ణ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. గత ఏడాది చివర్లో అఖండ సినిమా విడుదల అయ్యింది. ఈ ఏడాదిలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా తో రాబోతున్నాడు. మరో వైపు అనీల్ రావిపూడి దర్శకత్వంలో కూడా బాలయ్య సినిమా రూపొందబోతుంది.
ఈ రెండు సినిమా లపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
బాలకృష్ణ మరియు అనీల్ రావిపూడి కాంబో మూవీ ఈ సమ్మర్ లో పట్టాలెక్కే అవకాశం ఉంది. ఎఫ్ 3 సినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసిన నేపథ్యంలో దర్శకుడు అనీల్ రావిపూడి ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు.
మరో వైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో బాలకృష్ణ పాల్గొంటున్నాడు. ఈ సమ్మర్ కు ఆ సినిమా కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ సమ్మర్ లో సినిమాను పట్టాలెక్కించి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారట.
తాజాగా అనీల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా ఖచ్చితంగా సెన్షేషనల్ మూవీగా నిలుస్తుందని అనీల్ రావిపూడి నందమూరి అభిమానులకు హామీ ఇచ్చాడు.
ఈ సినిమా స్క్రిప్ట్ విన్న తర్వాత బాలకృష్ణ గారు కూడా అదే అభిప్రాయం తో ఉన్నారు. తప్పకుండా ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో అనిల్ రావిపూడి ఉన్నాడు.
ఇప్పటి వరకు అపజయం లేని అనీల్ రావిపూడి ఈ సినిమా తో మరో విజయాన్ని నందమూరి అభిమానులకు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు బాలయ్య సినిమా అంటే ఒక అభిప్రాయంతో ఉన్న అభిమానులకు మరియు ప్రేక్షకులకు సరికొత్త సినిమాను అనీల్ రావిపూడి చూపిస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ సినిమా లో సెకండ్ హాఫ్ లో కథకు సంబంధించి కీలక పాత్ర ఎంట్రీ ఇస్తుందట. ఆ పాత్ర ను ఒక స్టార్ నటుడితో చేయించే విషయమై చర్చిస్తున్నారు.
బాలకృష్ణ మరియు అనీల్ రావిపూడిల కాంబో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్న నేపథ్యంలో సినిమా లో రవితేజ ను నటింపజేసే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలు అయ్యింది.
బాలయ్య ఫ్యాన్స్ మరియు అనిల్ రావిపూడి ఫ్యాన్స్ అంతా కూడా సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నామని అంటున్నారు. ఈ సమయంలో సినిమా గురించి అనీల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు మరియు మరో హీరో అంటూ వస్తున్న వార్తలు సినిమా స్థాయిని మరింతగా పెంచుతున్నాయి.