Begin typing your search above and press return to search.
అనిల్ రావిపూడి 'భగవంత్ కేసరి' వచ్చేశాడు.. ఊచకోత షురూ
By: Tupaki Desk | 8 Jun 2023 9:26 AM GMTనందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆయన నటిస్తున్న 108వ సినిమా టైటిల్‍ను చిత్ర యూనిట్ ఈరోజు అధికారికంగా ప్రకటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు భగవంత్ కేసరి అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. దీనికి ఐ డోంట్ కేర్ అనే ట్యాగ్ ను చేర్చారు. అయితే ఈ టైటిల్ బాలకృష్ణ పాత్ర పేరుగా తెలుస్తోంది.
ఇక టైటిల్ పోస్టర్ చూస్తుంటే.. అందులో మనదేశ జాతీయ చిహ్నం కనిపిస్తుంది. ఇక ఈ పోస్టర్ లో బాలకృష్ణ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తున్నాడు. బాలయ్య డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా భిన్నంగా ఉంది. బ్రౌన్ కలర్ చొక్కా.. ఫార్మల్ ప్యాంటు ధరించి మెడలో కండువా ఉంది. ఇక బాలయ్య చేతికి బ్రాస్లెట్ , గడియారాన్ని గమనించవచ్చు. ఇక ఈ పోస్టర్ లో బాలయ్య ఒక ఆయుధాన్ని పట్టుకుని ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే... బాలకృష్ణపై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నట్లు ఉంది.
దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాలో బాలయ్యను మునుపెన్నడూ చూడని గెటప్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తున్నారు. టైటిల్ లాగే పోస్టర్ కూడా దృష్టిని ఆకర్షిస్తుంది. బాలకృష్ణ 108వ సినిమా టైటిల్‍ను విభిన్నంగా ప్రకటించాలని చిత్రయూనిట్ ఇప్పటికే ప్లాన్ చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో మొత్తంగా 108 హోర్డింగ్‍లతో ఈ టైటిల్ ను ప్రకటించింది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
జూన్ 10వ తేదీన నట సింహం బాలకృష్ణ పుట్టిన రోజు కాగా.. అంతకంటే రెండు రోజుల ముందే ఈ సినిమా టైటిల్ లాంఛ్ చేశారు. బాలకృష్ణ హీరో నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. బాలయ్యకు జంటగా నటిస్తున్నారు. యువ సంచలన హీరోయిన్ శ్రీలీక కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ బాలకృష్ణ 108వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షైన్ స్క్రీన్ పతాకంపై వస్తోంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సీ రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు.