Begin typing your search above and press return to search.

టీనేజ్ ప్రేమకథలకు కేరాఫ్ అడ్రెస్ ఆ పిల్లనే!

By:  Tupaki Desk   |   13 Feb 2021 8:00 AM IST
టీనేజ్ ప్రేమకథలకు కేరాఫ్ అడ్రెస్ ఆ పిల్లనే!
X
తమిళ .. మలయాళ భాషల్లో టీనేజ్ ప్రేమకథలు ఎక్కువగా వస్తుంటాయి. థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూసేవారిలో యూత్ ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. ఇక ప్రేమకథా చిత్రాలంటే వాళ్లు మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి థియేటర్ల బాట పడతారు. తెరపై జరుగుతున్న కథలో తాము కూడా ఒక పాత్రగా మారిపోయి ఫాలో అవుతుంటారు. ఇక ఆ ప్రేమకథలో ఏ మాత్రం కంటెంట్ ఉన్నా .. వాళ్లకి మంచి ఫీల్ కలిగించినా భారీ హిట్ తెచ్చిపెట్టేవరకూ వదిలిపెట్టరు. భారీ వసూళ్లను ముట్టజెప్పేవరకూ థియేటర్లను విడిచిపెట్టరు.

సాధారణంగా టీనేజ్ లవ్ స్టోరీస్ కి హీరోయిన్స్ దొరకడం కష్టమే. ఎందుకంటే ఆ ఏజ్ నాటికే సక్సెస్ ఫుల్ గా కెరియర్ ను సాగించే అమ్మాయిలు ఉండటం అరుదు. కొత్త పిల్లలను తెస్తే వాళ్లకి యాక్టింగ్ రాకపోతే ఇబ్బంది. అందువలన తెలుగులో టీనేజ్ ప్రేమకథలు జోరు ఈ మధ్య తగ్గింది. కానీ తమిళ .. మలయాళ భాషల్లో మాత్రం ఈ తరహా కథలు జోరుగానే సాగుతున్నాయి. ఇప్పుడు అక్కడ టీనేజ్ లవ్ స్టోరీస్ అనగానే ముందుగా 'అనిఖ సురేంద్రన్' పేరు వినిపిస్తోంది. దాంతో అక్కడ ఆమె డేట్స్ కోసం ఎగబడుతున్నారు.

అనిఖ సురేంద్రన్ అంటే చాలామందికి వెంటనే ఆ పిల్ల ఫేస్ గుర్తుకురాదు. 'విశ్వాసం' సినిమాలో అజిత్ కూతురుగా వేసిన అమ్మాయి అంటే వెంటనే లైట్ వెలుగుతుంది. ఈ సినిమాలో ఆ అమ్మాయి ప్రధానంగా చిత్రీకరించిన 'చిన్నారి తల్లీ .. ' పాట ఒక రేంజ్ లో జనంలోకి దూసుకెళ్లడం వలన ఆ పిల్ల వాళ్ల మనసులో అలా ఉండిపోయింది. ఇప్పుడు ఈ పిల్లకు 16 ఏళ్లు .. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేయడం వలన, నటన విషయంలో ఢోకాలేదు. అందువలన తమిళ .. మలయాళ దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారట. ఇక తెలుగు నుంచి కూడా అవకాశాలు వెళుతున్నాయనీ, ప్రవీణ్ సత్తారు తాజా చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం తీసుకున్నారని అంటున్నారు. తెలుగులో ప్రేమకథలు తెరకెక్కించాలనుకునేవారికి ఈ అమ్మాయి బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవడంలో సందేహం లేదు.