Begin typing your search above and press return to search.

వెళ్లే ముందు కూడా ఆమెపై కోపంతోనే ఆనీమాస్టర్‌

By:  Tupaki Desk   |   22 Nov 2021 7:37 AM GMT
వెళ్లే ముందు కూడా ఆమెపై కోపంతోనే ఆనీమాస్టర్‌
X
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 నుండి తాజా ఎపిసోడ్‌ లో ఆనీ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయ్యింది. ఈమె రెండు మూడు వారాల క్రితమే ఎలిమినేట్ అవ్వాల్సి ఉన్నా కూడా లక్కీగా సేవ్‌ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆమె బిగ్ బాస్ నుండి బయటకు వెళ్లి పోయే సమయం వచ్చింది. ఆమె హౌస్ లో ఉన్నన్ని రోజులు కూడా కాజల్‌ మరియు మరికొందరు సభ్యులపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది.

ఎప్పుడు కూడా గ్రూప్ గ్రూప్ అంటూ ఇతరులను ఆడిపోసుకుంటూనే ఉండేది. ఆమె కూడా ఒక గ్రూప్ లో ఉన్నా ఆ విషయాన్ని మాత్రం పట్టించుకోకుండా ఒక సారి ఒక మాట.. ఇంకోసారి ఇంకో మాట అన్నట్లుగా మాటలు మారుస్తూనే ఉండేది. ప్రేక్షకులు విసుగు తెప్పించిన ఆమె ప్రవర్తన చివరకు ఎలిమినేట్‌ అయ్యేందుకు కారణం అయ్యింది.

కాజల్‌ ను ఎన్నో సార్లు వెక్కిరించడం.. ఎన్నో సందర్బాల్లో అవమానించినట్లుగా మాట్లాడటం చేసిన ఆనీ మాస్టర్ ప్రతి సారి కూడా కాజల్‌ ఆటను విమర్శిస్తూనే వచ్చింది. ఆమె సొంతంగా ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా గేమ్‌ ఆడలేదు అంటూ చాలా సీరియస్ గా ఆనీ వ్యాఖ్యానించిన సందర్బాలు చాలా చాలా ఉన్నాయి.

కాజల్ అభిమానులు మరియు ఇతర కంటెస్టెంట్స్ అభిమానులు అంతా కూడా ఆమె తీరును వ్యతిరేకిస్తూనే వచ్చారు. ప్రియాంక మరియు ఆనీలు చివరి వరకు ఎలిమినేషన్ నామినేషన్‌ లో ఉండి చివరకు ప్రియాంక సేవ్ అవ్వగా ఆనీ మాస్టర్ ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించాడు.

ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నాగార్జునతో స్టేజ్ పై మాట్లాడిన ఆమె అక్కడ కూడా కాజల్‌ పై కోపంను కనబర్చింది. తనకు కాజల్‌ పై ఎలాంటి ఫీలింగ్ లేదని.. ఆమెను తాను ఫ్రెండ్‌ గా కాని ఏ ఇతర ఉద్దేశ్యంతో కాని చూడలేదు అంటూ తేల్చి చెప్పేసింది.

మొత్తానికి బిగ్ బాస్ నుండి తాను వెళ్లి పోయేందుకు కాజల్ కారణం అన్నట్లుగా ఆనీ వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ బజ్ లో కూడా ఆనీ మాస్టర్‌ మాట్లాడుతూ కాజల్ పై కాస్త గట్టిగానే స్పందించింది. కాజల్‌ ఆట ఆడకుండా పడుకున్న ఏం చేసినా కూడా స్టాటజీ అంటుందని చెప్పుకొచ్చింది. కాజల్‌ అస్సలు జెన్యూన్ గా ఆడటం లేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.