Begin typing your search above and press return to search.

విల‌న్‌ని స్పాట్‌లో కొట్టిన యాంగ్రీ యంగ్ మెన్

By:  Tupaki Desk   |   12 Jan 2022 7:30 AM GMT
విల‌న్‌ని స్పాట్‌లో కొట్టిన యాంగ్రీ యంగ్ మెన్
X
టాలీవుడ్ లో 90వ ద‌శ‌కంలో వ‌చ్చిన చిత్రాలు ఇప్ప‌టికీ ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచాయి. ఆ చిత్రాల రికార్డుని ఇంత వ‌ర‌కు ఏ సినిమా తిర‌గ‌రాయ‌లేదు. అలాంటి సినిమాల్లో యాంగ్రీ యంగ్ మెన్ డా. రాజ‌శేఖ‌ర్ న‌టించిన `అంకుశం` ప్ర‌త్యేక‌మైన‌ది. 1989లో విడుద‌లైన ఈ చిత్రం అప్ప‌ట్లో ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింది. ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ యాక్ష‌న్ చిత్రాల‌కు మాస్ట‌ర్ పీస్ గా నిలిచింది. కోడి రామ‌కృష్ణ డైరెక్ష‌న్ లో ఎం. శ్యామ్ ప్ర‌సాద‌రెడ్డి ఈ మూవీని నిర్మించారు.

నీరంఠం పాత్ర‌లో రామిరెడ్డి ప‌లికించిన అభిన‌యం, అత‌న్ని ఎదిరించే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా రాజ‌శేఖ‌ర్ న‌టించిన తీరు ఇప్ప‌టికీ పోలీస్ యాక్ష‌న్ చిత్రాల‌కు ఓ బెంచ్ మార్క్‌ని సెట్ చేసింది. పోలీస్ స్టోరీ అంటే `అంకుశం` అనే స్థాయిలో ఈ మూవీ రికార్డుని నెల‌కొల్పింది. హీరోగా డా. రాజ‌శేఖ‌ర్ కెరీర్‌నే మ‌లుపు తిప్పి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. అప్ప‌ట్లో మూడు విభాగాల్లో నందీ పుర‌స్కారాల్ని ద‌క్కించుకున్న ఈ మూవీ ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ ఫిల్మ్ గా టాలీవుడ్ సినీ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోయింది.

రామిరెడ్డి నీల‌కంఠంగా న‌టించిన విల‌నిజం ఒకెత్త‌యితే ఈ చిత్రానికి నేప‌థ్య సంగీతం అందించిన చెల్ల‌పిల్ల స‌త్యం అద్భుత ప‌నిత‌నం మ‌రోవైపు ఈ చిత్రాన్ని టాప్ హిట్ చిత్రాల్లో ఒక‌టిగా నిలిపింంది. ఈ సినిమా విడుద‌లై ఇప్ప‌టికి 33 ఏళ్ల‌వుతోంది. ఈ నేప‌థ్యంలో `ఆలీతో స‌ర‌దాగా` షోలో యాంగ్రీ యంగ్‌మెన్ డా. రాజ‌శేఖ‌ర్ ఈ మూవీ షూటింగ్ టైమ్ మెమ‌రీస్‌ని బ‌య‌ట‌పెట్టారు. ఈ సినిమా షూటింగ్ సంద‌ర్‌భంగా జ‌రిగిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించి స‌ర్‌ప్రైజ్ చేశారు.

`అంకుశం` చిత్రంతో విల‌న్ పాత్ర‌లో న‌టించిన‌ రామిరెడ్డిని అరెస్ట్ చేసి ఛార్మినార్ ముందు కొడ‌తూ .. తంతూ రాజ‌శేఖ‌ర్ తీసుకురావాలి. అయితే ఈ సీన్ లో ఎంత కొట్టినా రామిరెడ్డి క‌ద‌ల‌క‌పోవ‌డంతో నిజంగానే కొట్టార‌ట రాజ‌శేఖ‌ర్. ఈ విష‌యాన్ని తాజాగా వెల్ల‌డించారు. `రామిరెడ్డిగారు సున్నిత మ‌న‌స్కులు. ఎవరైనా ఏదైనా మాట అంటే ప‌డేవారు కాదు. అయితే ఈ మూవీకి సంబంధించిన కీల‌క స‌న్నివేశంలో ఆయ‌న‌ని కొట్టిన‌ట్టుగా నేను న‌టిస్తున్నా. ఆయ‌న మాత్రం అక్క‌డి నుంచి క‌ద‌ల‌డం లేదు. చూసే వాళ్లు ఏం అనుకుంటారోన‌ని ఆయ‌న దెబ్బ‌త‌గ‌ల‌న‌ట్టుగానే వున్నారు కానీ ముందుకు క‌ద‌ల‌డం లేదు. అది గ‌మ‌నించిన ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ ఆయ‌న‌ని నిజంగానే కొట్ట‌మ‌న్నారు.

కొడితే గానీ న‌టించ‌డేమోన‌ని నిజంగానే ఆయ‌న‌ని కొట్టేశా. అప్ప‌డు ముందుకు క‌దిలారు. ఆ సీన్ చేయ‌డం రామిరెడ్డికి ఇష్టం లేదు. కానీ అదే సినిమాకు హైలైట్ గా నిలిచింది` అని ఆనాటి సంగ‌తుల్ని గుర్తు చేసుకున్నారు రాజ‌శేఖ‌ర్‌. కొంత విరామం త‌రువాత డా. రాజ‌శేఖ‌ర్ `శేఖ‌ర్‌` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. జీవితా రాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ పెద్ద కుమార్తె శివానీ రాజ‌శేఖ‌ర్ న‌టించిన విష‌యం తెలిసిందే.