Begin typing your search above and press return to search.

ఔను.. వాళ్లిద్దరినీ విడదీసేశారు

By:  Tupaki Desk   |   22 Sept 2016 4:00 AM IST
ఔను.. వాళ్లిద్దరినీ విడదీసేశారు
X
బ్రాడ్ పిట్- ఎంజెలీనా జూలీలు హాలీవుడ్ స్టార్ కపుల్. వీళ్లిద్దరూ విడిపోతున్నారనే వార్తలు హాలీవుడ్ లో సంచలనానికి కారణమయ్యాయి. తన భర్త బ్రాడ్ పిట్ నుంచి విడాకులు కావాలని ఏంజెలీనా దరఖాస్తు చేసిందని.. ఇందుకు కారణం భర్త తాగుడు- పిల్లలను సరిగ్గా చూడకపోవడమేనని న్యూస్ వచ్చాయి. బ్రాంజెలీనాగా ప్రసిద్ధి గాంచిన ఈ జంట విడిపోవడం వార్తలు పుకార్లే అని చాలామంది అనుకునే టైమ్ లో.. దీన్ని ధృవీకరించే ఓ సాక్ష్యం ఇప్పుడు ప్రపంచానికి దొరికింది.

లండన్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఏంజెలీనా జూలీ- బ్రాడ్ పిట్ ల మైనపు విగ్రహాలు జంటగా ఉంటాయి. కానీ ఆ రెండు స్టాట్యూలను విడదీసి వేరువేరు ప్రదేశాల్లో అమర్చిన ఫోటోను.. టుస్సాడ్స్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందుకు కారణం వాళ్లిద్దరూ విడిపోతున్నట్లు తెలియడమే అని టుస్సాడ్స్ వర్గాలు తెలిపాయి. కేవలం మీడియాలో వచ్చిన వార్తలతో.. గతంలో ఎప్పుడూ చేయనటువంటి పని చేసే ధైర్యం టుస్సాడ్స్ చేయదు. ఇలా చేయమని.. వారికి లిఖితపూర్తవకంగా లెటర్ అందిందని.. అందుకే ఆ రెండు విగ్రహాలను విడదీశారని తెలుస్తోంది.

అయితే.. ఏంజెలీనా చెబుతున్నవన్నీ అబద్ధాలని.. పిల్లల కోసం కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు బ్రాడ్ పిట్ చెబుతున్నాడు. అసలు తన భార్య విడాకులకు అప్లై చేసిన సంగతి కూడా తనకు తెలీదంటున్నాడీ స్టార్ హీరో. మరోవైపు.. బాలీవుడ్ నటి మరియన్ కోట్లియార్డ్ తో బ్రాడ్ పిట్ సన్నిహితంగా మెలగమడే.. ఈ విడాకులకు కారణం అని తెలుస్తోంది.