Begin typing your search above and press return to search.

ఏంజెలీనా ఏం చూపిస్తోందంటే!!

By:  Tupaki Desk   |   16 Sept 2017 12:41 PM IST
ఏంజెలీనా ఏం చూపిస్తోందంటే!!
X
హాలీవుడ్ బ్యూటీ ఏంజెలీనా జోలీ ఎన్నో కోట్ల మందికి ఆరాధ్య దేవత. 42 ఏళ్ల వయసు వచ్చినా ఇప్పటికీ తరగని అందం ఆమెది. అయితే.. గత కొంత కాలంగా ఈ భామ బయట కనిపించిన దాఖలాలు దాదాపుగా లేవు. ఇందుకు చాలానా కారణాలు ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ తర్వాత ఒకసారి ప్రపంచ మహిళలకు సందేశం ఇస్తూ ఓసారి కనిపించింది. ఆ తర్వాత బ్రాడ్ పిట్ తో విడాకుల వ్యవహారం కారణంగా వార్తల్లో నానింది కానీ.. పబ్లిక్ అప్పియరెన్స్ మాత్రం లేదు.

విడాకుల వ్యవహారం కూడా కొలిక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు సడెన్ గా ప్రత్యక్షమైపోయింది ఏంజెలీనా. ఇంతకూ అమ్మడు ఇలా బైట కనిపించిన కారణం ఏంటంటే.. ఈ సొగసరి తొలిసారి దర్శకత్వం చేసిన సినిమా ప్రీమియర్ ప్రదర్శన. ఫస్ట్ దే కిల్డ్ మై ఫాదర్ చిత్రాన్ని.. ఈ గురువారం నాడు న్యూయార్క్ సిటీలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమం కోసమే ఏంజెలీనా బయటకు వచ్చింది. ఇలా తన బ్యాక్ లెస్ అందాలను ఆరబోసేసేసింది. అది కూడా తన కొత్త ట్యాటూను వయ్యారంగా ప్రదర్శించడానికే అనే సంగతి ఫోటో చూస్తే అర్ధమైపోతుంది. టూంబ్ రైడర్ బ్యూటీకి.. ఇలాంటి పజిల్స్ తరహా మ్యాప్స్ బాగా నచ్చేసినట్లున్నాయి. అందుకే దాదాపు టూంబ్ రైడర్ మ్యాప్ లాంటిదే ఓ పెద్ద ట్యాటూను వీపంతా పరుచుకునేలా వేయించుకుంది.

అసలే అమ్మడు ధరించిన గౌను స్ట్రాప్ లెస్ కూడా కావడంతో.. అందాలన్నీ తెగ దర్శనం ఇచ్చేస్తున్నాయి. ఇక ఈ ప్రీమియర్ కి ఏంజెలీనా జోలీ తన తండ్రి జాన్ వాయిట్ తో కలిసి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆరేళ్లుగా వీరిద్దరి మధ్య సత్సంబంధాలు లేవు. కానీ ఫస్ట్ దే కిల్డ్ మై ఫాదర్ మూవీలో సెంటిమెంట్ ఈ తండ్రీ కూతుళ్లను కలిపినట్లుగా ఉంది.