Begin typing your search above and press return to search.

యూవీ నన్ను కుక్కతో పోల్చాడన్న యువ హీరో!

By:  Tupaki Desk   |   13 Nov 2018 12:48 PM GMT
యూవీ నన్ను కుక్కతో పోల్చాడన్న యువ హీరో!
X
క్రీడాభిమానులకే కాకుండా అందని తన పద్దతితో - తన ప్రవర్తనతో అభిమానులను చేసుకున్న టీం ఇండియా స్టార్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌. బాలీవుడ్‌ లో చాలా సందడి చేసిన ఈ స్టార్‌ క్రికెటర్‌ ఈమద్య కాలంలో పెద్దగా కనిపించడం లేదు. ఐపీఎల్‌ కే పరిమితం అయిన ఈయన గురించి బాలీవుడ్‌ నటుడు అంగద్‌ బేడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువరాజ్‌ సింగ్‌ మరియు అంగద్‌ బేడీలు చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు. వీరిద్దరి స్నేహం గురించి అప్పట్లో బాలీవుడ్‌ వర్గాల్లో కూడా చర్చ జరిగేది. అయితే ఇద్దరి మద్య విభేదాలు తలెత్తాయి.

బాలీవుడ్‌ స్టార్‌ నటి నేహా ధూపియాను అంగద్‌ వివాహం చేసుకోవడం జరిగింది. ఆ సందర్బంగానే వీరిద్దరి మద్య విభేదాలు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ వార్తలు నిజమే అంటూ అంగద్‌ క్లారిటీ ఇచ్చాడు. బాలీవుడ్‌ సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసే షో నో ఫిల్టర్‌ నేహా కార్యక్రమంలో ఈసారి తన భర్తను తీసుకు వచ్చింది. అంగద్‌ తాజా చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా నో ఫిల్టర్‌ నేహా టాక్‌ షోలో పలు ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.

యువరాజ్‌ సింగ్‌ తనకు ఆప్త మిత్రుడు. ఇటీవల ఆయన కొంత మంది స్నేహితులను చూశాక - వారి కంటే కుక్కలు చాలా నయం అనిపిస్తుంది అంటూ పోస్ట్‌ చేశాడు. యూవీ ఆ విషయాన్ని పోస్ట్‌ చేసింది ఖచ్చితంగా నా గురించి అని నాకు తెలుసు. యూవీకి అంత కోపం రావడానికి నేనే కారణం. నా పెళ్లికి ఆయన్ను పిలువలేక పోయాను. పెళ్లికి పిలవలేక పోవడం వల్లే యూవీ నన్ను ద్వేషిస్తున్నాడు అన్నాడు. అంగద్‌ వివాహం గత ఏడాది అత్యంత రహస్యంగా - హడావుడిగా జరిగింది. అందుకే ఎవరిని పిలువలేక పోయాడు. యూవీ అందుకే కోపంగా ఉన్నట్లుగా అంగద్‌ చెప్పుకొచ్చాడు. ఎంత పెళ్లికి పిలవకుంటే మాత్రం స్నేహితుడిని కుక్కతో పోల్చుతాడా యూవీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అంగద్‌ ఇంకా ఏదైనా మోసంకు పాల్పడి ఉండాలి అంటూ యూవీ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.