Begin typing your search above and press return to search.

వైట్ టైటిఫిట్ లో మెరిసిపోతున్న ఆండ్రియా..!

By:  Tupaki Desk   |   10 July 2023 10:34 PM IST
వైట్ టైటిఫిట్ లో మెరిసిపోతున్న ఆండ్రియా..!
X
తమిళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నట్లో ఆండ్రియా జెరెమియా ఒకరు. విభిన్న చిత్రాల తో ఆమె అక్కడివారి ని ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు ఆమె చాలా సినిమాల్లో నటించారు. తమిళ్ డబ్బింగ్ సినిమా లతో తెలుగు ప్రేక్షకుల ను అలరించింది ఆండ్రియా. ఇక్కడి ప్రేక్షకుల కు కూడా చేరువయ్యారు. డైరెక్ట్ గా తెలుగు లోనూ ఓ సినిమా లో నటించారు. నాగ చైతన్య తడాఖా సినిమా లో ఆమె తన నటతో ఆకట్టుకున్నారు.

ఆండ్రియా సోషల్ మీడియా లోనూ చాలా చురుకుగా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ఫోటోల ను షేర్ చేసి అలరిస్తూ ఉంటుంది. తాజాగా కూడా ఆమె కొన్ని ఫోటోలు షేర్ చేయగా, అవి ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఆమె తెలుపు రంగు డ్రెస్ లో మెరిసింది. టైట్ ఫిట్ మినీ డ్రెస్ లో ఆమె చాలా అందంగా కనిపిస్తున్నారు. తన థైస్ షో చూస్తూ క్యూట్ గా ఫోటోల కు ఫోజులు ఇచ్చారు. వెనక మిర్రర్ కి ఉన్న లైట్ వెలుతురు లో ఆమె మరింత గ్లామరస్ గా కనిపిస్తుండటం విశేషం.

ఇప్పటి వరకు ఆండ్రియా నటిగానే చాలా మందికి తెలుసు. కానీ ఈ బ్యూటీ కేవలం నటిగానే కాదు సింగర్ గానూ తన ప్రతిభను చాటారు. రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమా లో ఓయే ఓయే పాట పాడి అలరించింది. ఇక నాగచైతన్య దడ సినిమా లోని దీవాళీ దీపాన్ని పాట ఎంత ఫేమసో తెలిసిందే. ఈ బ్యూటీ అటు సినిమాల్లో నటిస్తూ.. ఇటు సింగర్ గా తన సత్తా చాటుకుంటోంది.

సినిమాల్లో మాత్రమే కాదు, అప్పుడప్పుడు మ్యూజిక్ షోలు కూడా చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆమె దాదాపు 15 సంవత్సరాల పాటు మ్యూజిక్ నేర్చుకోవడానికి క్లాసుల కు వెళ్లిందట. అందుకే, తాను ఈ విధంగా పాడగులుగుతున్నానంటూ గతంలో చెప్పడం విశేషం. ఆండ్రియా తమిళ సినీ పరిశ్రమ లోకి ముందుగా సింగర్‌గా ఎంట్రీ ఇచ్చారు. 2005లో 'కందా నాల్ ముదల్' అనే తమిళ సినిమా ద్వారా సినిమా రంగం లోకి అడుగుపెట్టారు.

కాగా, ఆండ్రియా చాలా సార్లు వార్తల్లోకి ఎక్కిన సందర్భాల్లో ఉన్నాయి.తమిళ హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లతో ఆమెకు లవ్ ఎఫైర్స్ ఉన్నాయని వార్తలు రావడం విశేషం. ముఖ్యంగా ధనుష్, ఫహాద్ ఫాజిల్, అనిరుధ్ రవిచందర్ వంటి వారితో ప్రేమాయణం నడిపింద ని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అనిరుధ్ తో అయితే ఏకంగా ఫోటోలు కూడా బయట కు లీక్ అవ్వడం విశేషం.