Begin typing your search above and press return to search.

అప్పటి నుండి బెడ్‌ రూం సీన్స్‌ ఆఫర్‌ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   1 Oct 2020 9:00 AM IST
అప్పటి నుండి బెడ్‌ రూం సీన్స్‌ ఆఫర్‌ చేస్తున్నారు
X
హీరో లేదా హీరోయిన్‌ కు ఒక తరహా ఇమేజ్ వస్తే ప్రేక్షకులు వారిని అలాంటి పాత్రల్లోనే చూడాలనుకుంటారు. ఫిల్మ్‌ మేకర్స్ కూడా ఎక్కువగా వారికి ఆ తరహా పాత్రలను మాత్రమే ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్‌ ఒక్క సినిమాలో బోల్డ్‌ పాత్ర చేసి ఆ సినిమా సక్సెస్‌ అయితే వారి కెరీర్‌ మొత్తం కూడా అలాంంటి పాత్రలే మేకర్స్‌ ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇతర పాత్రలతో అస్సలు వారి వద్దకు వెళ్లరు. ఇప్పుడు హాట్‌ హీరోయిన్‌ ఆండ్రియా జెర్మియా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆమెకు వడ చెన్నైలో చేసిన తరహా పాత్రనే మళ్లీ మళ్లీ ఆఫర్‌ చేస్తున్నారు.

ఆ సినిమాలో బెడ్‌ రూం సీన్‌ లో ఆండ్రియా రెచ్చి పోయింది. బెడ్‌ రూంకు సంబంధించిన సీన్స్‌ లో సెన్సార్‌ బోర్డ్‌ సగానికి పైగా కట్‌ చేసింది అంటే ఏ స్థాయిలో ఆండ్రియా ఆ సీన్స్‌ లో నటించిందో అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమా కు మంచి క్రేజ్‌ రావడానికి సక్సెస్‌ అవ్వడానికి కారణం ఆమె చేసిన బెడ్‌ రూం సీన్స్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బెడ్‌ రూం సీన్స్ సోషల్‌ మీడియా ద్వారా లీక్‌ అయ్యి సంచలనంగా మారిన విషయం తెల్సిందే.

ఆ సీన్స్‌ చేసినప్పటి నుండి కూడా ప్రతి దర్శక నిర్మాత కూడా అదే తరహా పాత్రను ఆఫర్‌ చేస్తున్నారు. ఆ సినిమా చేసి తప్పు చేశాను.. ఆ సినిమాలో ఆ సీన్‌ చేయడం వల్ల నా కెరీర్‌ దెబ్బ తిన్నది అంటూ ఈ అమ్మడు ఆవేదన వ్యక్తం చేసింది. తెలుగులో ఈమె తడఖా సినిమాలో నటించింది. ఆ సినిమాతో ఆకట్టుకున్నా మళ్లీ ఛాన్స్‌ రాలేదు. తమిళంలో ఆఫర్లు వస్తున్నాఈమెకు స్టార్‌ డం మాత్రం దక్కడం లేదు.