Begin typing your search above and press return to search.

స్త్రీల అంతరంగం తెలుసుకోవడం ఓ ఆర్ట్​.. అది అందరికీ అసాధ్యం.. ఆండ్రియా కామెంట్స్​

By:  Tupaki Desk   |   21 Oct 2020 1:30 AM GMT
స్త్రీల అంతరంగం తెలుసుకోవడం ఓ ఆర్ట్​.. అది అందరికీ అసాధ్యం.. ఆండ్రియా కామెంట్స్​
X
అందాల భామ ఆండ్రియా జెర్మియా తెలుగు, తమిళ భాషల్లో ఒకప్పుడు దూసుకుపోయింది. తమిళంలో ఆమె నటించిన సినిమాలు చాలా ఎక్కువ. కొద్ది కాలంగా ఆమె హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చారు. కరోనా వల్ల కొత్త అవకాశాలు సన్నగిల్లడంతో ఆమె వెబ్​సీరిస్​ల బాట పట్టింది. తాజాగా పుథం పుధు కాలే అనే వెబ్​సీరిస్​లో నటించింది. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ వెబ్​సీరిస్​ను తెరకెక్కించారు. అయితే ఇందులో ప్రముఖ దర్శకులు రాజీవ్​ మీనన్​, గౌతమ్​ మీనన్​, మణిరత్నం, సహజనటి సుహాసిని పాలుపంచుకొన్నారు. లాక్​డౌన్​ నేపథ్యంలో స్త్రీల సమస్యలను ప్రస్తావిస్తూ ఈ సీరిస్​ను తెరకెక్కించారు.

ఈ వెబ్​సీరిస్​పై ఆండ్రియా మాట్లాడుతూ..
‘లాక్‌డౌన్ లో నా జీవితం పూర్తిగా స్తంభించింది. సినిమా అవకాశాలు లేవు. జిమ్​ చేసుకుందామంటే ఓపిక లేదు. మంచి ఫుడ్​ తీసుకొనే చాన్స్​ లేదు. నాకు పిచ్చెక్కిపోయింది. అటువంటి ఓ కథతో నా వద్దకు వచ్చినప్పుడు థ్రిల్‌ అయ్యా. పుథం పుధు కాలై‌లోని కొన్ని ఎపిసోడ్‌లలో నటించాను. రాజీవ్​ మీనన్​ డైరెక్ట్​ చేసిన కథలో నటించా. అందులో నేను డ్రగ్స్​ తీసుకున్న యువతిగా నటించా. ఇటీవల నాకు నచ్చిన చిత్రం ‘తారామణి’ దర్శకుడు రామ్ సూపర్​గా కథ రాసుకున్నారు. నిజానికి ఆయన ఓ ఫెమినిస్టు. చాలా మంది కథా రచయితలకు స్త్రీల సమస్యలు తెలియవు. స్త్రీల అంతరంగం తెలుసుకోవడం ఓ ఆర్ట్​ అది అందరికీ సాధ్యం కాదు.’ అని చెప్పారు ఆండ్రియా.