Begin typing your search above and press return to search.

ఏపీలో రంగస్థలం కు స్పెషల్ పర్మిషన్

By:  Tupaki Desk   |   23 March 2018 5:59 AM GMT
ఏపీలో రంగస్థలం కు స్పెషల్ పర్మిషన్
X
మొన్నటి వరకు టాలీవుడ్ లో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్లు దాటడానికి చాలా కష్టపడ్డాయి. ఏవి కూడా చలికాలంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే సమ్మర్ లో మాత్రం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వేడికి సెగలు రేపడానికి కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. అందుకోసం స్పెషల్ షోలను కూడా పొందడం మరో మేజర్ ప్లస్ పాయింట్. ఇప్పుడు రంగస్థలం సినిమాకు ఏపీ నుంచి స్పెషల్ షోకు అవకాశం దొరికింది.

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమా ఈ నెల 30న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాను భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో నిర్మించామని సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఒక షో ఎక్కువగా ప్రదర్శించుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. అంటే రోజుకు ఐదు ఆటలు. సమ్మర్ కావడంతో ఉదయం 5 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలో ఎక్స్ట్రా షోకు ప్రభుత్వం కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సినిమాకు ఈ తరహా ఎక్కువ షో చాలా వరకు ఉపయోగపడుతుందనే చెప్పాలి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా రికార్డులు బద్దలవుతాయి. సాధారణంగానే సినిమా 100 కోట్లవరకు ఈజీగా కలెక్ట్ చేయగలడు అని ఓ అంచనా వేసిన సినీ విశ్లేషకులు ఇప్పుడు ఒక షోకు స్పెషల్ పర్మిషన్ రావడంతో కలెక్షన్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే తెలంగాణలో మాత్రం ఇంకా 5 షోలకు పర్మిషన్ రాలేదు.