Begin typing your search above and press return to search.

అప్పుడు నానికి ఇప్పుడు తేజుకి

By:  Tupaki Desk   |   3 Jun 2018 6:57 AM GMT
అప్పుడు నానికి ఇప్పుడు తేజుకి
X
సక్సెస్ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా తేజ్ ఐ లవ్ యు జూన్ 29 విడుదల కోసం రెడీ అవుతోంది. ఇంకా టైం ఉన్నప్పటికీ ప్రమోషన్ ప్రాధాన్యత తెలుసు కాబట్టి టీమ్ ఇప్పటి నుంచే అలెర్ట్ గా ఉంటోంది. నిన్న సరదాగా తేజ్ ఐ లవ్ యు యూనిట్ కు రేడియో ఆర్జెలకు మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో ఆల్బమ్ లోని మొదటి పాట అందమైన చందమామ ను విడుదల చేసారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీకి దర్శకుడు కరుణాకరన్. తెలుగులో తన మొదటి సినిమా పవన్ కళ్యాణ్ తొలిప్రేమ నుంచి సంగీతం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే కరుణాకరన్ తేజ్ ఐ లవ్ యు కోసం కూడా అవే ఎఫర్ట్స్ పెట్టినట్టు కనిపిస్తోంది. నిన్ను కోరి-ఊపిరి లాంటి సెన్సిబుల్ మూవీస్ కి అద్భుతమైన స్కోర్ ఇచ్చిన గోపి సుందర్ దీనికి కూడా అదే మేజిక్ చేసుకుంటాడు అనే అంచనాలో ఉన్నారు మ్యూజిక్ లవర్స్. దానికి తగ్గట్టే నిన్న రిలీజ్ చేసిన అందమైన చందమామ పాట స్లో పాయిజన్ లాగా మెలోడీ లవర్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది. క్యాచీ పదాలతో సీనియర్ రచయిత సాహితి చక్కని సాహిత్యం అందించారు.

క్యూట్ మెలోడీగా ఫస్ట్ సాంగ్ పాస్ అయిపోయింది కాబట్టి నాని కోసం ఇచ్చినట్టే గోపి సుందర్ తేజుకు కూడా ఇచ్చి ఉంటాడు అనే భరోసా వచ్చేసింది.లిరికల్ వీడియోలో తేజు-అనుపమ పరమేశ్వరన్ కెమిస్ట్రీ చూస్తుంటే బాగానే సెట్ అయినట్టు కనిపిస్తోంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కరుణాకరన్ చేయటం ఇది రెండో సారి. గతంలో వెంకటేష్ హీరోగా వాసు చేసాడు. అప్పట్లో అది మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచి అవార్డులు గెలుచుకుంది. తన ప్రతి సినిమాలో సంగీత దర్శకులతో బెస్ట్ రాబట్టుకునే కరుణాకరన్ తేజ్ ఐ లవ్ లో కూడా అదే ఫాలో అయినట్టు కనిపిస్తోంది. మరి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో బాగా కసి మీదున్న ఈ మెగా మేనల్లుడికి ఇది హిట్ కావాల్సిన అవసరం చాలా ఉంది. జూన్ 29న లాక్ చేసిన ఆ తేదీకి ఇంకా వేరే సినిమాల ప్రకటన ఏదీ రాలేదు. హిందీ నుంచి వస్తున్న సంజు మాత్రం పోటీ ఇచ్చే అవకాశం ఉంది.