Begin typing your search above and press return to search.

హెబ్బా.. సినిమా ఏదయినా అదేనబ్బా!!

By:  Tupaki Desk   |   13 Jan 2017 4:09 PM GMT
హెబ్బా.. సినిమా ఏదయినా అదేనబ్బా!!
X
టాలీవుడ్ లో కాంబినేషన్స్ కి తెగ క్రేజ్ ఉంటుంది. అన్నిటి కంటే ముఖ్యంగా హీరో-హీరోయిన్ కాంబినేషన్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. యంగ్ జనరేషన్ హీరో హీరోయిన్స్ అయిన రాజ్ తరుణ్-హెబ్బా పటేల్ లకు హిట్ పెయిర్ అనే స్టాంప్ ఇప్పటికే పడిపోయింది.

కుమారి 21ఎఫ్.. ఈడోరకం ఆడోరకం సినిమాల్లో ఈ ఇద్దరు కలిసి నటించగా.. రెండు సినిమాలు సెన్సేషనల్ హిట్స్ సాధించాయి. ఈ జంట మళ్లీ కలిసి నటిస్తున్న మూవీ అంధగాడు. ఆ టైటిల్ కరెక్టే లెండి. అందగాడైన హీరో రాజ్ తరుణ్ అంధుడి పాత్ర చేస్తుండడంతో.. అలా అంధగాడుగా టైటిల్ సెట్ చేశారు. ఆ సంగతి పక్కన పెడితే.. సంక్రాంతి సందర్భంగా ఇప్పుడీ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. హీరో ఛాతీపై తలపెట్టి పడుకుని సేద తీరుతున్న హీరోయిన్ హెబ్బా పటేల్.. ఓ రేంజ్ లో సోయగాలు ప్రదర్శించేస్తోంది. మోకాళ్లకు అడుగు పైకి వేసిన డ్రస్ లో భలే ఎట్రాక్టివ్ గా ఉంది హెబ్బా.

వెల్లకిలా పడుకుని ప్రేమ చూపిస్తున్న హెబ్బాను.. ఆమె అందాలను చూస్తే.. ఎలాంటి సినిమాలో అయినా అబ్బబ్బా అని కుర్రాళ్లు ఫీలయిపోవాల్సిందే. ఇక గుడ్డివాడు అని ఇండికేట్ చేసేలా ఓ కళ్లజోడు.. పక్కనే ఓ హ్యాండ్ స్టిక్ ఉంచారు. పార్క్ లో ఎంచక్కా రిలాక్స్ అయిపోతూ ప్రేమించుకుంటున్న ఈ జంట ఫోటో పోస్టర్ బాగా ఎట్రాక్ట్ చేస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/