Begin typing your search above and press return to search.

ఆ రీమేక్ లో హీరో హీరోయిన్ ఇద్దరు బ్యాడ్‌ ఛాయిస్‌

By:  Tupaki Desk   |   20 March 2021 5:00 AM GMT
ఆ రీమేక్ లో హీరో హీరోయిన్ ఇద్దరు బ్యాడ్‌ ఛాయిస్‌
X
బాలీవుడ్‌ లో సూపర్‌ హిట్‌ అయిన అంధాధున్‌ ను తెలుగు మరియు తమిళంలో రీమేక్ చేస్తున్నారు. తెలుగు లో ఈ సినిమా ను యంగ్‌ హీరో నితిన్ లీడ్ పాత్రలో చేస్తున్నాడు. ఇక ఒరిజినల్ వర్షన్‌ లో టబు పోషించిన పాత్రను తమన్నాతో చేయిస్తు హీరోయిన్‌ రాధిక ఆప్టే పాత్రను నభా నటేష్‌ తో చేయించేందుకు సిద్దం అయ్యారు. తెలుగు అంధాధున్‌ స్టార్‌ కాస్టింగ్‌ సినిమా పై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ రీమేక్ వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తమిళ స్టార్‌ కాస్ట్‌ మాత్రం సినిమాపై ఆసక్తి లేకుండా చేస్తుందని టాక్ వినిపిస్తుంది.

అంధాధున్‌ లో హీరోగా ఆయుష్మాన్ ఖురానా నటించాడు. యంగ్‌ హీరోగా ఆయన కనబర్చిన ప్రతిభకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాంటిది తమిళంలో ఆ పాత్రను సీనియర్‌ హీరో అయిన ప్రశాంత్‌ చేసేందుకు సిద్దం అయ్యాడు. ఎప్పుడైతే హీరోగా ప్రశాంత్‌ చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయో అప్పుడే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయింది. ఇప్పుడు హీరోయిన్‌ గా ప్రియా ఆనంద్ ను ఎంపిక చేశారు. తెలుగులో లీడర్ సినిమాలో కనిపించిన ప్రియా ఆనంద్‌ గుర్తు ఉంది కదా... ఆమెను ఈ రీమేక్ లో హీరోయిన్‌ గా ఎంపిక చేయడంతో ఉన్న ఆసక్తి కూడా పోయింది అంటూ తమిళ మీడియా వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. రీమేక్‌ లో హీరో హీరోయిన్‌ ఇద్దరు కూడా మైనస్ గా చెబుతున్నారు.