Begin typing your search above and press return to search.

ఆరంభంకు ముందే ఆ 'అంధాదున్‌' పై పెదవి విరుపులు

By:  Tupaki Desk   |   11 March 2021 5:45 AM GMT
ఆరంభంకు ముందే ఆ అంధాదున్‌ పై పెదవి విరుపులు
X
బాలీవుడ్‌ ట్యాలెంటెడ్‌ హీరో ఆయుష్మాన్ ఖురానా హీరోగా శ్రీరామ్ రాఘవన్‌ దర్శకత్వంలో వచ్చిన అంధాదున్‌ సినిమా సెన్షేషనల్ సక్సెస్ అయ్యింది. ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ సినిమా విడుదల అయ్యి భారీ వసూళ్లను నమోదు చేసింది. అంధాదున్‌ పెట్టుబడికి పది రెట్లకు మించి లాభాలను తెచ్చి పెట్టిందనే టాక్ వచ్చింది. యూనివర్శిల్‌ సబ్జెక్ట్‌ అవ్వడంతో ఈ సినిమా ను ఇతర భాషల్లో రీమేక్‌ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే నితిన్ తో తెలుగులో అంధాదున్ రీమేక్‌ ను ప్రకటించారు. ఇక తమిళంలో తెలుగు కంటే ముందే రీమేక్ ను ప్రకటించారు. తెలుగు లో నితిన్‌ హీరోగా ఈ రీమేక్ తెరకెక్కుతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. కాని తమిళనాట మాత్రం పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు.

తమిళ అంధాదున్‌ కు మొదట జేజే ఫ్రెడరిక్‌ ను ఎంపిక చేశారు. కాని ఆయన స్క్రిప్ట్‌ ను మార్చడంలో విఫలం అయ్యాడని దాంతో పదే పదే మార్పులు చెప్పడం వల్ల ఆయన తప్పుకున్నట్లుగా తమిళ మీడియా వర్గాల్లో టాక్‌. ఆయన తప్పుకోవడం వల్ల ఆ బాధ్యతను సీనియర్‌ దర్శకుడు అయిన త్యాగరాజన్‌ నెత్తిన పెట్టుకున్నాడు. ఒకప్పుడు మంచి సినిమాలు చేసిన త్యాగరాజన్‌ పై ఇప్పుడు జనాల్లో ఆసక్తి లేదు. ఇక హీరోగా ప్రశాంత్ చేయడం వల్ల కూడా ఈ సినిమా క్రేజ్ తగ్గినట్లయ్యింది. ఈమద్య కాలంలో ప్రశాంత్ ఒక్కటి అంటే ఒక్క సినిమా ను కూడా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేసేలా చేయలేదు. అందుకే ఈ సినిమా రీమేక్ ను ఆయన చేస్తానంటే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిగా లేరు. మరో ముఖ్యమైన విషయం ఏంటీ అంటే టబు పోషించిన పాత్రను ఈ రీమేక్ లో సిమ్రాన్ తో చేయిస్తున్నారు. కనీసం ఈ విషయంలో అయినా ప్రేక్షకులు సంతృప్తిగా లేరు. కనుక రీమేక్ గురించి జనాలు అసలు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.