Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ న‌టి క‌నిపిస్తే చాలు అవార్డులే!

By:  Tupaki Desk   |   6 Aug 2019 4:52 AM GMT
సీనియ‌ర్ న‌టి క‌నిపిస్తే చాలు అవార్డులే!
X
ఆర్టిస్టుకి స్క్రిప్టు ఎంపిక చాలా ఇంపార్టెంట్. న‌టీన‌టులు అనుభ‌వాన్ని బ‌ట్టి.. అభిరుచిని బ‌ట్టి స్క్రిప్టును ఎంచుకుంటారు. ఆ కోణంలో చూస్తే సీనియ‌ర్ న‌టి ట‌బు ఎంపిక‌లు మాస్ట‌ర్ క్లాస్ అని పొగిడేయ‌ని వాళ్లు ఉండ‌నే ఉండ‌రు. సెలెక్టివ్ గా ఒక్కో సినిమాకి క‌మిట‌వ్వ‌డం ట‌బు స్టైల్. అందుకే త‌ను న‌టించిన చాలా సినిమాల‌కు అవార్డులు వ‌చ్చాయి. రెండు సార్లు జాతీయ ఉత్త‌మ న‌టిగా అవార్డులు గెలుచుకుంది. చాందిని బార్ - మాచిస్ చిత్రాల‌కు ఈ పుర‌స్కారాలు ద‌క్కాయి. ఫిలింఫేర్-ఐఫా-జీ-స్టార్ డ‌స్ట్- గిల్డ్- స్క్రీన్ అవార్డ్స్ .. ఇలా పుర‌స్కారాల‌కు అంతూ ద‌రీ లేదు. గొప్ప సెలెక్ష‌న్ తోనే ఇదంతా సాధ్య‌మైంది.

తాజాగా మ‌రో మాస్ట‌ర్ క్లాస్ ఎంపిక‌తో ట‌బు మ‌రోసారి చ‌ర్చ‌ల్లోకొచ్చారు. ట‌బు న‌టించిన `అంధాధున్` చిత్రాన్ని మెల్ బోర్న్(ఆస్ట్రేలియా)లో జ‌ర‌గ‌నున్న ఇండియన్ ఫిలింఫెస్టివ‌ల్ లో ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ ఉత్స‌వాల‌కు ట‌బుతో పాటుగా రాధిక ఆప్టే- ఆయుష్మాన్ ఖురానా స‌హా ఇత‌ర‌త్రా చిత్ర‌యూనిట్ అటెండ్ కానుంద‌ని తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా ట‌బు త‌న ఎంపిక‌ల గురించి ముచ్చ‌టించారు.

``అంధాధున్ ఇత‌ర సినిమాల్లా ఫార్ములా సినిమా కాదు. భారీ యాక్ష‌న్.. చెట్టు పుట్ట‌ల్లో సాంగ్స్ వేసుకోవ‌డం.. పంచ్ డైలాగులు త‌ర‌హా సినిమా కానేకాదు. ఈ సినిమా క‌థాంశం వీట‌న్నిటికీ భిన్న‌మైన‌ది. అందుకే విజ‌యం సాధించింద‌ని భావిస్తున్నాను`` అని ట‌బు అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం ఆడియెన్ మైండ్ సెట్ మారింద‌న్న ఉద్ధేశాన్ని ట‌బు త‌న మాట‌ల్లో వ్య‌క్తం చేశారు. ఈ త‌ర‌హా మార్పు ఇప్పుడు టాలీవుడ్ లోనూ క‌నిపిస్తోంది. అందుకేనేమో త్రివిక్ర‌మ్ సినిమాతో ట‌బు తిరిగి తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నార‌న్న చర్చా సాగుతోంది. బాలీవుడ్ లో అంధాధున్- భార‌త్- దేదే ప్యార్ దే లాంటి చిత్రాల్లో ట‌బు వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్నారు. ఇప్పుడు బ‌న్ని- త్రివిక్రమ్ సినిమాలో ఏ త‌ర‌హా పాత్ర‌లో న‌టిస్తున్నారు? అన్న‌ది చూడాలి.