Begin typing your search above and press return to search.

టాలీవుడ్..మాలీవుడ్ లో ఆ రీమేక్ ఎప్పుడంటే?

By:  Tupaki Desk   |   7 Sept 2021 10:45 AM IST
టాలీవుడ్..మాలీవుడ్ లో ఆ రీమేక్ ఎప్పుడంటే?
X
`అందాధూన్` బాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. ట‌బు ..ఆయుష్మాన్ ఖురానా...రాధికా ఆప్టే ప్ర‌ధాన పాత్ర‌ల్లో శ్రీరామ్ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. 32 కోట్ల బ‌డ్జెట్ తో తో తెర‌కెక్కిన చిత్రం 400 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ప్ర‌స్తుతం నెట్ ప్లిక్స్ లో చిత్రం అందుబాటులో ఉంది. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంతో తెర‌కెక్కిన చిత్రంపై ద‌క్షిణాది నిర్మాత‌ల క‌ళ్లుప‌డ్డాయి. ఇదే చిత్రాన్ని తెలుగు లో నితిన్ హీరోగా `మాస్ర్టో` టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.


`వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్`..`ఎక్స్ ప్రెస్ రాజా` వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మేర్ల‌పాక గాంధీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే అన్ని ప‌నులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. డిస్నీ హాట్ స్టార్ లో చిత్రం సెప్టెంబ‌ర్ 17న రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంపై నితిన్ భారీగానే ఆశ‌లు పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. `భీష్మ‌` త‌ర్వాత నితిన్ కి స‌రైన స‌క్సెస్ ప‌డ‌లేదు. `చెక్`..`రంగ్ దే` రెండు చిత్రాలు నిరుత్సాహ‌ప‌రిచాయి. స‌క్సెస్ అనివార్య‌మైన స‌మ‌యం కూడా. దీంతో నితిన్ మాస్ర్టో స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.

అలాగే మ‌ల‌యాళంలో `అంధుదాన్ ` రీమేక్ లో పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టిస్తున్నారు. `బ్ర‌హ్మ‌మ్` టైటిల్ తో ర‌వి కె. చంద్ర‌న్ తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నుల్లో ఉంది. అక్క‌డ అమెజాన్ ప్రైమ్ లో అక్టోబ‌ర్ లో రిలీజ్ కి స‌న్నాహాలు చేస్తున్నారు. ఓ వైపు వ‌రుస విజ‌యాల‌తో ఊపుమీదున్న పృథ్వీరాజ్ మ‌రోవైపు స‌క్సెస్ పుల్ ద‌ర్శ‌కుడిగాను వెలిగిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో `బ్ర‌హ్మ‌మ్` తో మ‌రో స‌క్సెస్ ఖాతాలో ప‌డితే సుకుమార్ క్రేజ్ మూడింత‌లు రెట్టింపు అవుతుంది. ప్ర‌స్తుతం పృథ్వీరాజ్ ద‌ర్శ‌కుడిగా - మోహ‌న్ లాల్ తో బ్రో డాడి చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ద‌ర్శ‌కుడిగా పృథ్వీ కి రెండ‌వ చిత్ర‌మిది.