Begin typing your search above and press return to search.

శ్రీముఖి-విష్ణుప్రియ ఎనర్జీ మామూలుగా లేదే!

By:  Tupaki Desk   |   15 May 2020 12:45 PM IST
శ్రీముఖి-విష్ణుప్రియ ఎనర్జీ మామూలుగా లేదే!
X
టీవీ ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న తెలుగు భామల్లో యాంకర్ శ్రీముఖి ఒకరు. అదుర్స్.. అదుర్స్ 2.. మనీ మనీ.. భలే ఛాన్స్ లే.. పటాస్.. కామెడీ నైట్స్.. కామెడీ ఖిలాడీలు.. సరిగమప.. ఇలా శ్రీముఖి ఎన్నో విజయవంతమైన షోలకు హోస్ట్ గా వ్యవహరించింది. మరో యాంకర్ విష్ణుప్రియ కూడా సేమ్ టు సేమ్. పోరా పోవే లాంటి టీవీ షోలతో తన సత్తా చాటింది.

ఇలాంటి ఇద్దరు ఎనర్జిటిక్ భామలు ఒక్కచోట చేరితే.. అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తే ఏమౌతుంది. రచ్చ రంబోలా అవుతుంది. ఇద్దరూ కలిసి ఒకరితో ఒకరు పోటీ అన్నట్టుగా డాన్స్ చెయ్యడం విశేషం. దాదాపు మూడు నిముషాల నిడివి ఉండే ఈ వీడియోలో రకరకాలుగా నిలుచుని.. నడుస్తూ.. కూర్చుని డ్యాన్స్ చేస్తూ అందరినీ మెప్పించారు. ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండిపోయేసరికి చాలామందికి నీరసం వచ్చేసింది. శ్రీముఖి-విష్ణుప్రియ ఇద్దరూ ఇలాంటి ఉత్సాహం కలిగించే వీడియోలతో అందరికీ ఎనర్జీ తీసుకొస్తున్నారు. వీరిని చూసి ప్రేరణగా అభిమానులు కూడా ఇలాంటి డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారేమో మరి.