Begin typing your search above and press return to search.

పార్టీలో ఆ యాంకర్ అలా రెచ్చిపోయిందా

By:  Tupaki Desk   |   23 Nov 2016 3:46 AM GMT
పార్టీలో ఆ యాంకర్ అలా రెచ్చిపోయిందా
X
టీవీ యాంకర్లు ఈ మధ్య ఏ మాత్రం తగ్గట్లేదు. బుల్లితెరపై యాంకరింగ్ వరకే యాంకర్లు అనే కాన్సెప్ట్ ఎప్పుడో మాయమైపోయి.. రకరకాల కార్యక్రమాలతో రెచ్చిపోవడం చూస్తూనే ఉన్నాం. సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేయడంలో సత్తా చూపించే వాళ్లకు బాగా డిమాండ్ పెరిగిపోతోంది.

ఝాన్సీ.. సుమ.. లాంటి వాళ్ల తర్వాత అనసూయ.. రష్మీలు గ్లామర్ యాంగిల్ తో సత్తా చాటారు. ఇప్పుడు మరికొందరు ఇదే రూట్లో ఉండగా.. వీరిలో శ్యామల కూడా టాప్ గేర్ లోనే ఉంది. రీసెంట్ గా జరిగి తన బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోస్ ను.. శ్యామల షేర్ చేసుకుంది. అటు అందం.. ఇటు యాంకరింగ్ ప్రతిభ.. యాక్టింగ్ ట్యాలెంట్ తో పాటు.. శ్యామలలో ఉన్న అల్లరి యాంగిల్ ఏంటో కూడా చూపించేసింది. గతంలో ఎప్పుడూ జరగనంత స్థాయిలో గ్రాండ్ గా పుట్టిన రోజు జరుపుకున్నానని చెప్పిన శ్యామల.. తన లైఫ్ లో ఈ బర్త్ డేను మాత్రం ఎప్పటికీ మర్చిపోనని అంటోందీ ట్యాలెంటెడ్ బ్యూటీ.

ప్రస్తుతం పెద్ద పెద్ద రోల్స్ ఏమీ చేతికి అందడం లేదు కానీ.. అందుకు తాను ఏ రకంగా తీసిపోనని చెప్పే ప్రయత్నం చేసిందా అనిపించక మానదు. ఈమె ప్రతిభకు తగ్గట్లుగా కొన్ని ఆఫర్స్ వస్తే మాత్రం.. ఈ హంగామా మరింతగా పెరిగిపోవడం ఖాయం.