Begin typing your search above and press return to search.

ఏ సినిమాకు కాపీ అంటున్న యాంకర్ సుమ

By:  Tupaki Desk   |   30 Jun 2017 4:23 AM GMT
ఏ సినిమాకు కాపీ అంటున్న యాంకర్ సుమ
X
తెలుగు సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతుంది అంటే.. ఎవరక్కడ యాంకరింగ్ చేస్తున్నారని అడగకూడదు. ఆదివారం ఫలానా షో వస్తుంది, ఎవరు చేస్తున్నారు అని అడగనవసరం లేదు. గేమ్ షో వస్తుంది, పండుగ వస్తే స్టార్ ఇంటర్వ్యూ వస్తుంది హోస్ట్ ఎవరు అని అడిగే ప్రశ్న అనవసరం. ఎందుకంటే ఏ షూ చూసిన ఏ ఫంక్షన్ చూసిన ఏ స్పెషల్ స్టార్ ఇంటర్వ్యూ చూసిన మనకు కనిపించేది యాంకర్ సుమనే కాబట్టి. ఇప్పుడు కూడా నాని సినిమా నిన్ను కోరి సినిమా ఆడియో ఫంక్షన్లో యాంకరింగ్ చేసింది సుమనే. కాకపోతే ఈ ఫంక్షన్లో సుమ తన తెలివితేటలుతో ఇటు సినిమా తీసే వాళ్లపై అటు సినిమా చూసే వాళ్ళ పై చిన్న చురక వేసింది.

ఒక సినిమా వస్తుంది అంటే అది దేన్ని నుండో ప్రేరణ పొంది తీసి ఉంటారు అని అందరూ అనుకుంటారు కానీ అది మన కథే అయి ఉంటుంది అని ఎవరు అనుకోవటం లేదు ఇప్పుడు. అన్నీ కలిపి ఒక సినిమాగా చెబుతున్నారుని చాలామంది అనుకొంటున్నారు. కొంతమంది అవి ఏంటో వెతికే పనిలో ఉంటారు. అందుకే ఈ ఫంక్షన్లో నాని దగ్గరుకు వచ్చి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి ట్రైలర్ చూసిన తరవాత అని కొన్ని సినిమా పోస్టర్లు ప్లే చేసింది. వాటిలో ‘సుందరాకాండ’ - ‘ప్రేమదేశం’ - ‘టైటానిక్’ - ‘స్వీట్ నవంబర్’ ఉన్నాయి ఎందుకంటే. నాని ఒక పాటలో ‘ఏమండోయ్ మాస్టారు’ అంటాడు ఇది వెంకటేష్ సినిమా సుందరాకాండ లో వాడే పదం అని, ‘ఒక హీరోయిన్ ఇద్దరు హీరోలు వాళ్ళ మధ్య ప్రేమ’ అంటే ఇది ప్రేమదేశం నుండి అని, ఈ సినిమాలో కారు లో ప్రేమ అంటే టైటానిక్ షిప్ లో ఉంటుంది బడ్జెట్ లేక కారులో తీశారు అని ఇంకా చివరగా నిన్ను కోరి పోస్టర్ పై ఒక ‘గోల్డెన్ బ్రిడ్జ్’ కనిపిస్తుంది కదా ఇది ఒక ఇంగ్లిష్ సినిమా ‘స్వీట్ నవంబర్’ సినిమా పోస్టర్ నుండి తీసుకున్నారు అని చెప్పింది. అంతేనా అని నాని అడిగితే మా సినిమాలో ఇంకా చాలా ఉంది మీరు రండి చూడండి అన్నాడు.

సుమ తెలివిగానే ఆ సంబాషణను ముగించింది ఇలా. “ఇన్ని ఆలోచనలు మనకు (ప్రేక్షకులుకు) ఎందుకు. వాళ్ళు కష్టపడి తీశారు వాళ్ళ డబ్బులు పెట్టారు పాటలు వాళ్ళు పాడారు, టాలెంట్ ఉంది వాళ్ళకు. మనం ఒక్క టికెట్ కొని సినిమా చూడలేమా'' చెప్పండి అని చెప్పింది. అంటే ఇక్కడ తీసే వాళ్ళు చాలావాటి నుండి చూసి తీస్తున్నారు అని చెబుతూ మీరు కూడా చాల ఎక్కువ ఆలోచిస్తున్నారు అని చూసే వాళ్ళకు చెబుతూ బ్యాలెన్స్ చేసింది. ఇప్పుడు అర్ధమైందా సుమనే ఎందుకు యాంకర్ గా పెట్టుకుంటున్నారో.​ స్కిట్ బాగుంది కాని.. ఇలా ఆడియో రిలీజ్ రోజునే సినిమా కాపీ అంటే.. నాని ఫ్యాన్స్ హర్ట్ అయ్యారుగురూ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/