Begin typing your search above and press return to search.

యాంకర్ కు మాంచి గౌరవం ఇచ్చారే

By:  Tupaki Desk   |   12 Jun 2017 10:09 AM GMT
యాంకర్ కు మాంచి గౌరవం ఇచ్చారే
X
సుమ.. తెలుగు ప్రజలకు పరిచయం చెయ్యనక్కర్లేని పేరు. యాంకర్లకు కూడా స్టార్ ఇమేజ్ సాధ్యమని నిరూపించింది. సుమ టీవీ యాంకర్ గా ఎంత పాపులరో.. సినిమా ప్రోగాంలకు హోస్టింగ్ చేయడంలో అంతకు మించి పాపులర్. సుమ హోస్టింగ్ చేయని మేజర్ సినిమా ఈవెంట్లు చాలా తక్కువ. బేసిగ్గా మళయాళీ అయినా తన మాటలో తేట తెలుగుదనమే వినిపిస్తుంది. ఎవ్వరూ నొచ్చుకోకుండా.. ఎవ్వరినీ నొప్పించకుండా ప్రోగ్రాం సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయడం సుమ స్పెషాలిటీ.

తన మాటలు, మంచితనంతో అందరి నుంచి ప్రశంసలు అందుకునే సుమకు దువ్వాడ జగన్నాథం సినిమా ఆడియో లాంచ్ లో అరుదైన గౌరవమే దక్కింది. తాను హోస్ట్ చేసిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ లోనే ఓ పాట రిలీజ్ చేసే అవకాశం కల్పించారు. ‘ప్రోగ్రాం బిగినింగ్ నుంచి ప్రోగ్రాం ఎండ్ అయ్యేవరకు సుమగారు స్టేజ్ మీదే ఉంటారు. స్టేజ్ మీద అందరినీ ఆమె మెచ్చుకుంటూనే ఉంటారు. మాకు తెలిసి ఎప్పుడూ సుమ ఏ పాట లాంచ్ చేయలేదు. అందుకే డీజే సినిమాలో మెచ్చుకో పాట సుమ చేతులమీదుగా లాంచ్ చేయాలని’ డైరెక్టర్ హరీష్ శంకర్, ప్రొడ్యూసర్ దిల్ రాజు కంబైన్డ్ గా కోరారు.

అనుకోని విధంగా వచ్చిన గౌరవానికి సుమ ఒక్క క్షణం ఆశ్చర్యపడుతూనే ‘స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో పాట లాంచ్ అవకాశం తనకు దొరకడం అదృష్టమని, ఈ అవకాశం ఇచ్చిన దిల్ రాజు, హరీష్ శంకర్ లకు థ్యాంక్యూ’ అంటూ సినిమాలోని మెచ్చుకో పాట సుమ లాంచ్ చేసింది. టీవీ, చిత్ర పరిశ్రమల్లో ఎవరికీ దక్కని ఒక అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. కీపిటప్ సుమా

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/