Begin typing your search above and press return to search.

ఫ్లాష్ బ్యాక్: సుమ హీరోయిన్.. స్టార్ రైటర్ హీరో!

By:  Tupaki Desk   |   27 Oct 2022 2:35 AM GMT
ఫ్లాష్ బ్యాక్: సుమ హీరోయిన్.. స్టార్ రైటర్ హీరో!
X
కొంతమంది మొదలుపెట్టిన ప్రయాణం ఎటువైపు నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో ఊహించడం కష్టంగానే ఉంటుంది. ఇక యాంకర్ సుమ అయితే మొదట నటిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత ఊహించని విధంగా యాంకర్ గా మారిపోయింది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా చూసుకుంటే మంచి పాపులారిటీ సంపాదించుకున్న టాప్ యాంకర్స్ లలో సుమ ఒకరు.

ఆమె అనుకున్నట్లు హీరోయిన్ గా క్లిక్ కాక పోయినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం ఒక ఏడాదిలో దాదాపు హీరోయిన్స్ కంటే ఎక్కువ స్థాయిలోనే సంపాదిస్తుంది అని చెప్పవచ్చు. అయితే యాంకర్ సుమ మొదట్లో ఒక సినిమాలో హీరోయిన్ గా చేసింది. అందులో హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇండస్ట్రీలో మొన్నటి వరకు టాప్ మోస్ట్ రైటర్ గా క్రేజ్ అందుకుంటూ వచ్చిన వక్కంతం వంశీ తోనే యాంకర్ సుమ హీరోయిన్ గా ఒక సినిమా చేశారు.

వక్కంతం వంశీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో చాలా సినిమాలు చేశాడు. అతనొక్కడే సినిమా నుంచి ఇప్పుడు వస్తున్న ఏజెంట్ వరకు కూడా సురేందర్ రెడ్డి కి వక్కంతం వంశీనే కధలు అందించాడు. వీరి కలయికలో వచ్చిన కిక్కు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే రైటర్ కంటే ముందుగానే వంశీ కథానాయకుడిగా కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో నటించాడు.

ఆ సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కింది. సుమ హీరోయిన్ గా నటించిన ఆ సినిమా 1996లో విడుదల అయింది. విడుదలైన అనంతరం సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ టాక్ అందుకుంది. అప్పటివరకు మంచి ఫామ్ లో ఉన్న దాసరి నారాయణరావు ఆ సినిమాతో ఊహించిన విధంగా డిజాస్టర్ ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇక ఆ తర్వాత వక్కంతం వంశీ మళ్లీ నటన వైపు వెళ్లకుండా రైటర్ గానే తన కెరీర్ ను కొనసాగించింది ఇప్పుడు దర్శకుడిగా కొనసాగుతున్నాడు. ఇక మరోవైపు యాంకర్ సుమ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి సినిమా ఈవెంట్స్ కు యాంకర్ గా చేస్తూ తన సరికొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టింది.

వంశీ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య అనే సినిమా తీశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అతను నితిన్ తో ఒక సినిమా చేస్తున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.