Begin typing your search above and press return to search.

వాలెంటైన్స్ డే తర్వాత శ్రీముఖి జీవితంలో మరో గుర్తుండి పోయే రోజు

By:  Tupaki Desk   |   26 Feb 2022 11:30 AM GMT
వాలెంటైన్స్ డే తర్వాత శ్రీముఖి జీవితంలో మరో గుర్తుండి పోయే రోజు
X
పది రోజుల క్రితం శ్రీముఖి సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఒక విషయం ఆమె అభిమానుల దృష్టినే కాకుండా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా మీడియా వర్గాల వారిని మరియు సినీ వర్గాల వారిని కన్ఫ్యూజన్‌ లో నెట్టి వేసింది.

అది ఏంటీ అంటే.. వాలెంటైన్స్ డే సందర్బంగా శ్రీముఖి ఈ రోజును గుర్తు పెట్టుకోండి.. ఇది జీవితంలోనే చాలా స్పెషల్‌ డే అంటూ చెప్పుకొచ్చంది. ఆ పోస్ట్‌ తో శ్రీముఖి ప్రేమలో ఉన్నట్లుగా క్లారిటీ వచ్చేసింది.

శ్రీముఖి ప్రేమలో ఉన్నది క్లారిటీ వచ్చేసింది కాని అది ఎవరితో అంటూ గత పది రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. బుల్లి తెరకు చెందిన వ్యక్తి అంటూ కొందరు అంటుంటే మరి కొందరు ఇండస్ట్రీకి దూరంగా ఉండే వ్యక్తి అంటూ ఇంకొందరు అంటున్నారు.

మొత్తానికి శ్రీముఖి ప్రియుడు ఎవరు అనే గెస్సింగ్స్ ను జనాలు చాలా రకాలుగా చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినా కూడా ఆమె మనసులో ఉన్నది ఎవరు అనేది తెలియడం లేదు.

త్వరలో చెప్తాను అంటూ ప్రకటించిన శ్రీముఖి తాజాగా మరో స్పెషల్‌ డే అంటూ 25 ఫిబ్రవరి 2022 తేదీని చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఆ తారీకున మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి భోళా శంకర్‌ సినిమాలో నటించింది. అదే రోజు పవన్‌ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ను భోళా శంకర్‌ చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ తో కలిసి చూపింది. అందుకే ఆ తేదీ చాలా స్పెషల్‌ అంటూ శ్రీముఖి చెప్పుకొచ్చింది.

మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో శ్రీముఖి నటిస్తున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చింది. కాని అది ఏం పాత్ర.. ఎలా ఉండబోతుంది అనేది అభిమానులకు ఆసక్తిని కలిగిస్తోంది. చిరంజీవి సినిమాలో పాత్ర ఎంత చిన్నది అయినా కూడా అది దక్కడమే అదృష్టం అంటూ ఇండస్ట్రీ వారు అనుకుంటూ ఉన్నారు.

శ్రీముఖికి ఆ అవకాశం రావడంతో ఆమె కెరీర్ లోనే ది బెస్ట్‌ మూమెంట్‌ అంటూ మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక శ్రీముఖి గత కొన్నాళ్లుగా బుల్లి తెర మరియు వెండి తెరపై సమానంగా ప్రయాణం సాగిస్తుంది. బుల్లి తెరపై ఆమె యాంకర్‌ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నా కూడా అభిమానులు ఆమె ను ఇంకా ఆధరిస్తూనే ఉన్నారు. తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు యాంకర్ అనగానే సుమ తర్వాత ఎక్కువగా మంది చెప్పే పేరు శ్రీముఖి అనడంలో సందేహం లేదు. అంతటి గుర్తింపు దక్కించుకున్న శ్రీముఖి నటిగా భోళా శంకర్‌ తర్వాత బిజీ అయ్యేనో చూడాలి.