Begin typing your search above and press return to search.

శ్రీముఖి.. వ్వాటే థైస్ షో!

By:  Tupaki Desk   |   3 Jan 2023 7:30 AM GMT
శ్రీముఖి.. వ్వాటే థైస్ షో!
X
తెలుగు టెలివిజన్ ప్రపంచంలో గ్లామరస్ బ్యూటీగా మంచి క్రేజ్ అందుకున్న వారిలో శ్రీముఖి ఒకరు. ఒకవైపు అనసూయ రష్మీ వంటి టాప్ యాంకర్స్ నుంచి పోటీ ఎదురవుతున్నప్పటికీ కూడా శ్రీముఖి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ తో ముందుకు సాగుతోంది. ఇక కేవలం రియాలిటీ షో లతో మాత్రమే కాకుండా శ్రీముఖి సోషల్ మీడియా ద్వారా కూడా మంచి క్రేజ్ అందుకుంటుంది.

ఇక అవసరమైన సమయంలో మంచి ఆఫర్లు వస్తే సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే అప్పుడప్పుడు అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు మాత్రం ఊహించిన విధంగా ఉంటున్నాయి.

రీసెంట్ గా లిఫ్టులో ఒక ఫోటో షూట్ చేసిన శ్రీముఖి గ్లామర్ షో తో ఊహించని విధంగా కనిపించింది. అమ్మడు మెరిసే డ్రస్సులో చాలా అందంగా స్టిల్స్ అయితే ఇచ్చింది.

అంతేకాకుండా లెగ్స్ అందాలతో కూడా శ్రీముఖి మరోసారి ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో పొట్టి డ్రెస్ లలో శ్రీముఖి చాలాసార్లు దర్శనమిచ్చింది. కానీ ఈసారి మాత్రం అంతకంటే భిన్నంగా స్టిల్స్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక శ్రీముఖి బుల్లితెరపై బాగానే బిజీ అవుతున్నప్పటికీ వెండితెరపై మాత్రం గతంలో మాదిరిగా ఆఫర్లు అయితే అందుకోవడం లేదు.

జులాయి సినిమాలో అల్లు అర్జున్ సిస్టర్ గా కనిపించిన శ్రీముఖి ఆ తర్వాత వెంట వెంటనే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సైడ్ పాత్రలలో బాగానే నటించింది. అంతేకాకుండా ఆ మధ్యలో లీడ్ రోల్స్ చేసే అవకాశం కూడా అందుకుంది.

కానీ ఆ సినిమాలేవి కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ఇక శ్రీముఖి ప్రస్తుతం గ్లామర్ స్టిల్స్ తో ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో ఆమె ఇలాంటి పాత్రలలో కూడా నటించడానికి వెనుకడుగు వేయదు అని అనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో శ్రీముఖి వెండి తెరపై ఏదైనా మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.