Begin typing your search above and press return to search.

వాటే హగ్.. కింగ్ తో శ్రీముఖి..!

By:  Tupaki Desk   |   2 March 2021 7:30 AM GMT
వాటే హగ్.. కింగ్ తో శ్రీముఖి..!
X
'కింగ్' అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన 'బిగ్ బాస్ తెలుగు సీజన్-3 లో యాంకర్ శ్రీముఖి కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ రియాలిటీ షోలో తనదైన శైలిలో గేమ్ ఆడిన శ్రీముఖి.. ఆ సీజన్ కి రన్నరప్ గా నిలిచింది. హౌస్ నుంచి బయటకొచ్చాక అమ్మడికి కావల్సినంత ఫేమ్ వచ్చింది. ఇక చివరి దాకా ఆటలో ఉన్న శ్రీముఖికి ఆ సమయంలో నాగార్జునతో బాగా చనువు ఏర్పడింది. దీని కారణంగా చాలా కాలం తరువాత కింగ్ నాగార్జునను చూసిన శ్రీముఖి ఆయన వద్దకు పరుగున వెళ్లి ఆలింగనం చేసుకుంది.

నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ''వైల్డ్ డాగ్'' రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కోసం నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రొడ్యూసర్ మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి - డైరెక్టర్ అహిషోర్ సోలోమన్ - సయామీ కేర్ - 'బిగ్ బాస్' ఫేమ్ ఆలీ రెజా - రుద్ర ప్రదీప్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ కి వచ్చిన నాగార్జున వద్దకు నవ్వుతూ వచ్చిన శ్రీముఖి ఆయనతో ఆప్యాయంగా మాట్లాడి హగ్ చేసుకుంది. ప్రస్తుతం ఈ స్వీట్ హగ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

శ్రీముఖి మాట్లాడుతూ 'నాగ్ సర్ ముందు యాంకరింగ్ చేయాలంటే భయంగా ఉంది' అని చెప్పుకొచ్చింది. ఇక నాగ్ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీముఖి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ''శ్రీముఖి నిన్ను చూసి చాలా రోజులైంది.. బిగ్ బాస్ నుంచి వచ్చాక మళ్ళీ కలవలేదు.. సంతోషంగా ఉంది.. నా మీద ఏమైనా కోపం ఉందా'' అంటూ నవ్వుతూ అన్నారు. దీంతో ఆనందంతో ఉప్పొంగిపోయిన శ్రీముఖి 'అదేమీ లేదు సర్' అని బదులిచ్చింది.