Begin typing your search above and press return to search.

మరో మూడేళ్ల వరకు ఆమెను ఎవరు ఆ ప్రశ్న వేయరేమో

By:  Tupaki Desk   |   16 Aug 2021 11:30 PM GMT
మరో మూడేళ్ల వరకు ఆమెను ఎవరు ఆ ప్రశ్న వేయరేమో
X
తెలుగు బుల్లి తెరపై ఆమె ఒక సంచలనం... తెలుగు యాంకర్ అనగానే గుర్తుకు వచ్చే పేర్లలో మొదట సుమ ఉంటే ఆ వెంటనే శ్రీముఖి పేరు వినిపిస్తుంది. ఆ షో ఈ షో అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ సందడి చేస్తూనే ఉంటుంది. అన్ని ప్రముఖ ఎంటర్‌ టైన్ మెంట్‌ ఛానెల్స్ లో కూడా శ్రీముఖి సందడి ఉంటుంది. తెలుగు బుల్లి తెరపై ఆమె సంచలనం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. బుల్లి తెర రాములమ్మ అంటూ ఆమెకు అభిమానులు బిరుదు ఇచ్చేశారు. అంతటి గుర్తింపు దక్కించుకున్న శ్రీముఖి హీరోయిన్ గా 'క్రేజీ అంకుల్స్' సినిమా తెరకెక్కింది. ఆ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా శ్రీముఖి పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇస్తూ వచ్చింది.

వెండి తెరపై తన సత్తా చాటేందుకు గాను ఈ అమ్మడు చేస్తున్న ప్రయత్నం క్రేజీ అంకుల్స్‌ కు మంచి బజ్ ఉంది. ఈ సినిమా హిట్ అయితే వరుసగా శ్రీముఖి హీరోయిన్ గా సినిమాలు చేసేందుకు సిద్దం అవుతుందని అంతా నమ్ముతున్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో శ్రీముఖి మాట్లాడుతూ పెళ్లి గురించి స్పందించింది. పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించగా.. తనకు 31 ఏళ్లు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అంటూ స్పష్టంగా చెప్పేసింది. దాంతో ఆమె పెళ్లి గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయ్యింది.

31 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోను అంటూ శ్రీముఖి చెప్పిన నేపథ్యంలో ఆమెను మరో మూడు ఏళ్ల వరకు ఎవరు కూడా పెళ్లి గురించి ప్రశ్నించే అవకాశం లేదు. ప్రస్తుతం 28 ఏళ్ల వయసులో ఉన్న శ్రీముఖి ఈ మూడు సంవత్సరాల పాటు బుల్లి తెర మరియు వెండి తెరపై సాధ్యం అయినంత వరకు సందడి చేసి ఆ తర్వాత పెళ్లికి సిద్దం అవుతుందేమో చూడాలి. శ్రీముఖి హీరోయిన్ గా నటించిన క్రేజీ అంకుల్స్ సినిమా కాస్త బోల్డ్‌ గా ఉంటుందని.. కనుక సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. కాని థియేటర్లు కూడా పునః ప్రారంభం అవ్వడం మొదలుకుని పలు విషయాల కారణంగా క్రేజీ అంకుల్స్ ను థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేశారు. శ్రీముఖి అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మంచి మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీగా ఈ సినిమా ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఎంటర్‌ టైన్ మెంట్‌ ను కూడా కావాల్సినంత ఇవ్వనుందట.