Begin typing your search above and press return to search.

రంగంలోకి మరో యాంకర్!!

By:  Tupaki Desk   |   28 Feb 2017 6:00 PM GMT
రంగంలోకి మరో యాంకర్!!
X
ఇప్పుడున్న చాలామంది టివి యాంకర్లలో ముందుగా హీరోనో హీరోయినో అవ్వాలని వచ్చినవారే. యాంకర్ అనసూయ.. రష్మి.. వంటివారు ముందుగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత అక్కడ పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో టివిలోకి వచ్చేశారు. అలాగే వక్కంతం వంశీ.. కుంచె రఘు వంటి వారు కూడా హీరోలవ్వాలనుకుని.. యాంకర్లు అయిపోయారు.

ఇక కొందరు మాత్రం.. యాంకర్లుగా కెరియర్ మొదలెట్టి హీరో హీరోయిన్లుగా ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిలో ప్రదీప్.. శ్రీముఖి వంటి యాంకర్ల పేరు చెప్పుకోవచ్చు. ఇదే బ్యాచ్ కు చెందిన మరో పాపులర్ యాంకర్ రవి. తన యాంకరింగ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో.. తన చుట్టూ తిరిగే వివాదాలు అంతకంటే ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పుడు మనోడు సైలెంట్ గా హీరోగా ఒక సినిమాను చేసేశాడు. ''ఇది మా ప్రేమ కథ'' అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒక రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో రవి తన యాక్టింగ్ టాలెంట్ కూడా చూపించేస్తాడట.

ఇప్పటివరకు తమిళంలో యాంకర్లు మాంచి స్టార్లు అయ్యారు కాని.. తెలుగులో మాత్రం అది వర్కవుట్ కాలేదు. ఇక్కడ యాంకర్లూ రేడియో జాకీలు హీరోలుగా అవకాశాలు రాక.. చివరకు కమెడియన్లగా సెట్టయిపోతున్నారు. ఒకవేళ రవి హిట్టు కొడితే మాత్రం.. హీరోగా సెటిల్ అయిపోవడం ఈజీయే. తేడా వస్తే ఎనీవే బుల్లి తెర ఉంది కాబట్టి పెద్దగా కంగారుపడక్కర్లేదు.