Begin typing your search above and press return to search.
శ్రీముఖిలో కొత్త కోణం బయటకొచ్చింది
By: Tupaki Desk | 12 March 2017 6:20 PM ISTకొద్దికాలం క్రితం సినీనటులకు మాత్రమే ఫ్యాన్స్ ఉండేవారు.తర్వాతి కాలంలోవచ్చిన మార్పుల పుణ్యమా అని.. టీవీల జోరు పెరగట.. యాంకర్లకు పేరు ప్రఖ్యాతులు పుష్కలంగా రావటమే కాదు..మెగాస్టార్ లాంటోళ్లు సైతం టీవీల్లో షోలు చేసేస్తున్నారు. పేరుకు బుల్లితెరే అయినా.. ఇమేజ్ లెక్కల్లో మాత్రం పెద్దగా ఉండటంతో పెద్ద.. పెద్ద స్టార్లు సైతం టీవీల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదిలా ఉంట.. మారిన టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు సోషల్ మీడియా మోస్ట్ పవర్ ఫుల్ గా మారిపోయింది.
టీవీ స్టార్లు.. సినీస్టార్లు..టైమ్లీగా ప్రత్యేక వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. సరికొత్త ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. గతంలో ఇమేజ్ రావాలంటే ఎవరో ఒకరు.. ఏదో ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడా పరిస్థితి లేదు. లోపల విషయం ఉంటే.. బయటకు రావాలంటే వేదికలు చాలానే ఉన్నాయి. తాజాగా అలాంటి ప్రయత్నమే చేసి.. తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది యాంకర్ శ్రీముఖి.
హోలీని పురస్కరించుకొని యాంకర్ శ్రీముఖి..రవిలు తమ అభిమానులకు వినూత్నరీతిలో హోలీ గ్రీటింగ్స్ చెప్పేశారు. మెగాస్టార్ చిరంజీవి.. శ్రీదేవి జంటగా నటించిన నాటి క్లాసిక్ జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలోని డైలాగుల్ని డబ్ స్మాష్ చేసి చెప్పారు. ‘‘అధరములు అదిరిపోయే అగ్నిపుట్టినది.. అమృతము లేద ఇంట..’’ అంటూ అమాయకంగా ఇంద్రుడి కుమార్తెగా శ్రీముఖి డైలాగు చెబితే..‘‘ఆ.. అమృతమా బయట దుకాణాల్లో దొరుకుతుంది. తెచ్చిపెట్టనా..’’ అంటూ యాంకర్ రవి ఎటకారం చేసిన మాటలు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అంతనా.. అమాయకమైన ఎక్స్ ప్రెషన్స్ తో శ్రీదేవిలా యాక్ట్ చేసిన శ్రీముఖి..వైట్ డ్రెస్ లో అదరగొట్టటమే కాదు.. తనలోని మరో యాంగిల్ ను ప్రదర్శించిందని చెప్పాలి.
