Begin typing your search above and press return to search.

యాంకర్ రవి బ్యాడ్ కామెంట్స్ కేసు.. పోలీసుల ఎంట్రీ

By:  Tupaki Desk   |   17 Dec 2021 7:34 AM GMT
యాంకర్ రవి బ్యాడ్ కామెంట్స్ కేసు.. పోలీసుల ఎంట్రీ
X
బిగ్ బాస్ సీజన్ 5 లో యాంకర్ రవి ఖచ్చితంగా టాప్‌ 5 లో ఉంటాడని అంతా బలంగా నమ్మారు. కాని అనూహ్యంగా యాంకర్ రవి రెండు వారాల ముందుగానే ఎలిమినేట్ అయ్యాడు. ఆ సమయంలో సోషల్‌ మీడియాలో యాంకర్ రవి గురించి బ్యాడ్‌ కామెంట్స్ ను చాలా మంది పెట్టారు. రవి హౌస్ లో ఉన్న సమయంలో ఆయన బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అనేక రకాలుగా ఆయన్ను సోషల్‌ మీడియా ద్వారా తిట్టిన వారు ఉన్నారు. కారణం లేకున్నా కూడా ఏదో ఒక ఉద్దేశ్యంతో బ్యాడ్‌ కామెంట్స్ పెట్టి ఆయన్ను ఇబ్బంది పెట్టారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిలోకి ఎక్కువగా బ్యాడ్‌ కామెంట్స్ ను ఎదుర్కొన్నది యాంకర్ రవి అనడం లో సందేహం లేదు. ఆయనపై మాత్రమే కాకుండా ఆయన భార్య మరియు పాప పై కూడా నీచంగా కొందరు కామెంట్స్ పెట్టారు.

తన కుటుంబ సభ్యులను విమర్శించినందుకు గాను యాంకర్‌ రవి చాలా సీరియస్ అయ్యాడు. తన వ్యక్తిగత విషయాలను.. తన పాప ను ఇందులోకి లాగడంను ఆయన తట్టుకోలేక పోయాడు. అందుకే ఈ బ్యాడ్‌ కామెంట్స్ కు చెక్‌ పెట్టే ఉద్దేశ్యంతో బ్యాడ్‌ కామెంట్స్ చేసిన వారిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను తన కుటుంబంను మానసికంగా వేదిస్తున్నారు అంటూ అందులో రవి పేర్కొన్నాడు. యాంకర్‌ రవి ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ మొదలు పెట్టారు. అందులో భాగంగా పోలీసులు స్వయంగా యాంకర్ రవి ఇంటికి వెళ్లి వివరాలను సేకరించడం జరిగింది. రవి ని ట్రోల్‌ చేసినట్లుగా చెబుతున్న కామెంట్స్ ను వారు నమోదు చేయడం జరిగింది.

రవి ఇంటికి వచ్చిన పోలీసులకు తనపై బ్యాడ్‌ కామెంట్స్ చేసిన వారికి సంబంధించిన అకౌంట్స్ వివరాలను తెలియజేశాడట. అదే సమయంలో తన కుటుంబం పై కూడా కొందరు చేసిన బ్యాడ్‌ కామెంట్స్ ను స్క్రీన్‌ షాట్స్ ను పోలీసులకు ఇవ్వడం జరిగిందట. ఈ విషయాన్ని స్వయంగా యాంకర్ రవి సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు. మీరు చేయాల్సిన పని మీరు చేశారు.. నేను చేయాల్సిన పని నేను చేశాను అన్నట్లుగా పేర్కొన్నాడు. ఇకపై అయినా సోషల్‌ మీడియాలో బ్యాడ్‌ కామెంట్స్ ను మానేసి క్లీన్ సోషల్‌ మీడియాను మెయింటెన్ చేద్దాం అన్నట్లుగా యాంకర్ రవి పిలుపునిచ్చాడు. ఈమద్య కాలంలో సెలబ్రెటీలను నెగటివ్‌ కామెంట్స్ చేయడం ద్వారా పాపులారిటీని దక్కించుకోవాలని కొందరు భావిస్తున్నారు. ఆ నెగిటివిటీ మరీ పీక్స్‌ కు వెళ్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి.