Begin typing your search above and press return to search.

ఫైనల్ గా యాంకర్ కాస్త బయటకొచ్చాడు

By:  Tupaki Desk   |   1 Feb 2018 9:26 AM GMT
ఫైనల్ గా యాంకర్ కాస్త బయటకొచ్చాడు
X

అప్పట్లో 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఈవెంట్ జరుగుతున్నప్పుడు.. అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు అంటూ సీనియర్ యాక్టర్ చలపతిరావు ఒక చెత్త కామెంట్ చేశారు. కాని కామెంట్లు చేసిన ఆయనకు సినిమాల్లో అవకాశాలు బాగానే వస్తున్నా కూడా.. ఆ కామెంట్ ను 'సూపర్ చెప్పారు సార్' అంటూ వెనకేసుకొచ్చిన యాంకర్ రవి మాత్రం ఆ తరువాత పెద్ద పెద్ద సినిమా ఈవెంట్లలో ఎక్కడా కనిపించలేదు. కొన్ని కార్యక్రమాలకు అతను రాకపోగా.. కొందరు అతన్ని పిలవలేదు.

అయితే గత రాత్రి జరిగిన 'ఆ' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో మాత్రం రవి బాగా సందడి చేశాడు. చాలా రోజుల తరువాత తన మార్కు పంచులతో నవ్వించాడు. పైగా ఒక వ్యక్తి కాజల్ ను అక్కా పిలవగానే.. 'ఎవ్వుడ్రా ఆడు.. కాజల్ ను అక్కా అంటున్నాడు? బావా.. బావ.. యాడున్నావ్ బావా?' అంటూ నవ్వులు పూయించేశాడు. అక్కడ ఆల్రెడీ చాలామంది స్టార్లు ఉన్నా కూడా.. మరో ప్రక్కన ఫ్రేములన్నీ తినేసి నాని రేంజు వక్తలు ఉన్నా కూడా.. రవి మాత్రం వారందరి మధ్యలో ఉండి కూడా తను యాంకర్ గా స్పెషల్ అంటూ ప్రూవ్ చేసుకున్నాడు.

ఆ మధ్యన ఒక సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యాంకర్.. నటుడిగా తెర మీద మాత్రం క్లిక్ అవ్వలేదు. 'ఇది మా లవ్ స్టోరి' అంటూ అలరించలేకపోయాడు. అయితే యాంకర్ గా పటాస్ వంటి ప్రోగ్రామ్స్ లో తన సత్తాను తెగ చాటేస్తున్నాడు. మరి ఇప్పుడు 'ఆ' సినిమాతో మరోసారి లైవ్ ఈవెంట్స్ తో బిజీ అవుతాడేమో చూడాలి.