Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU : తమ్ముడు అంటూ రవికి ఎందుకు ఇంత శిక్ష విశ్వ?

By:  Tupaki Desk   |   8 Sep 2021 4:18 AM GMT
#BIGGBOSS5TELUGU : తమ్ముడు అంటూ రవికి ఎందుకు ఇంత శిక్ష విశ్వ?
X
కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా పవర్ రూమ్‌ ఎంట్రీ ఛాలెంజ్ ను బిగ్‌ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చాడు. బజర్ మోగిన సమయంలో పవర్‌ రూమ్‌ ముందు ఉండే స్కానర్ లో చేయి పెట్టాల్సి ఉంటుంది. అలా ఎవరైతే ముందు చేయి పెడతారో ఆ పవర్‌ రూమ్‌ యాక్సెస్ వారికి దక్కుతుంది. నిన్నటి ఎపిసోడ్‌ లో ఇద్దరికి పవర్ రూమ్‌ యాక్సెస్ దక్కింది. అందులో మొదటగా విశ్వ వెళ్లి రాగా రెండవ వ్యక్తి మానస్. వీరిద్దరికి కూడా స్పెషల్‌ పవర్‌ లు రాగా వాటితో ఇంటి సభ్యులకు టాస్క్ లు ఇవ్వడం జరిగింది. మొదటగా విశ్వ పవర్‌ హౌస్ లోకి వెళ్లాడు. అక్కడ బిగ్‌ బాస్ మీరు ఎంపిక చేసిన ఇద్దరికి చెందిన బట్టలు ఇతర వస్తువులు అన్ని కూడా బయటకు పంపించాల్సి ఉంటుంది అన్నాడు. అందుకు విశ్వ ఇద్దరిని ఎంపిక చేయాల్సి వచ్చింది. ఇద్దరిలో ఒకరు యాంకర్ రవి కాగా మరొకరు ప్రియా అని విశ్వ చెప్పాడు. ఆ ఇద్దరు తమకు చెందిన డ్రస్‌ ల నుండి మొదలుకుని అన్నింటిని కూడా బయటకు పంపించేశారు. దాంతో రవి అమ్మాయి డ్రస్ వేసుకోవాల్సి వచ్చింది. రవి ఆ డ్రస్‌ వేసుకున్న సమయంలో చాలా మంది ఫన్‌ చేశారు. రవి కూడా చాలా స్పోర్టివ్‌ గా తీసుకుని కామెడీ పండించాడు.

రవి థింగ్స్ అన్ని బయట పెట్టి అమ్మాయి డ్రస్ వేసుకున్న తర్వాత విశ్వ కు మరియు రవికి మద్య చర్చ జరుగుతుంది. అక్కడే ఇంకా కొందరు కూడా ఉన్నారు. అందరిని పేరు పెట్టి పిలిచే రవి నన్ను మాత్రం మొదటి నుండి కూడా అన్న అని పిలుస్తాడు. ఇప్పటికి కూడా అన్న అని పిలుస్తుంటే చాలా బాగుందని.. నాకు ఇటీవలే తమ్ముడు చనిపోయాడు వాడిని గుర్తుకు తీసుకు వచ్చేలా రవి అన్న అంటూ పిలిస్తే సంతోషంగా ఉందంటూ కన్నీరు పెట్టుకున్నాడు. తమ్ముడిని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న విశ్వను రవి ఓదార్చాడు. ఇద్దరు కొద్ద సమయం మాట్లాడుకుని ఆ తర్వాత చిల్‌ అయ్యారు. అయితే నెటిజన్స్ మాత్రం విశ్వను ట్రోల్‌ చేస్తున్నారు.

అన్న అన్న అంటూ వెంట తిరిగితే బాగానే పెట్టావుగా.. అంటూ పవర్‌ రూమ్‌ పవర్‌ ద్వారా బట్టలు తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా కూడా జరుగుతుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తే మరి కొందరు విశ్వ ఆట బాగుండాలనే ఉద్దేశ్యంతో రవి చాలా ఫన్నీగా ఈ టాస్క్ ను తీసుకుంటాడనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎక్కువ శాతం మంది రవి అభిమానులు నిన్ను రవి అన్న అన్న అంటూ పిలుస్తూ ఉంటే ఇలా శిక్షించడం ఏంటి విశ్వ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తమ్ముడు అంటూనే భలేగా రవిని బలి చేశావు విశ్వ అంటూ మరి కొందరు కామెంట్స్ చేశారు. మొత్తానికి రవి అభిమానులు విశ్వ నిర్ణయంపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తుండా.. కొందరు మాత్రం రవి గొప్పతనం తెలుస్తుంది అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రవి అమ్మాయి డ్రస్ వేసుకుని అందరిని నవ్వించే ప్రయత్నం చేసి ఆకట్టుకున్నాడు.