Begin typing your search above and press return to search.
ఎంతపని చేశావ్ ప్రదీప్? ఆ రచ్చలోకి వెళ్లటమా? బయటకు ఎలా వస్తాడో?
By: Tupaki Desk | 21 Jun 2021 10:16 AM ISTహుషారుగా.. నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడే యాంకర్ ప్రదీప్ తాజాగా చిక్కుల్లో పడ్డారు. వివాదాల్లోకి ఇరుక్కోవటం అతగాడికి కొత్తేం కాకున్నా.. తాజా ఇష్యూలో మాత్రం ఆయన అనూహ్యంగా ఇరుక్కున్నారని చెప్పక తప్పదు. ఏదో యాంకరింగ్ చేసుకొని బండి లాగించే ప్రదీప్.. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఫ్లోలో అతని నోటి నుంచి వచ్చిన మాట తాజా వివాదంగా మారింది.
ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్రదీప్ నోటి నుంచి వచ్చిన మాటపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇష్యూ కోర్టులో ఉందని.. అలాంటి వాటిపై ఆయన ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నిస్తున్నారు. ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్రదీప్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కోర్టులో ఉన్న అంశాల్ని ప్రదీప్ ఎలా మాట్లాడతారని.. కోట్లాది మంది రైతులు.. ప్రజల మనోభావాల్ని కించపర్చేలా ప్రదీప్ వ్యవహరిస్తే అతనికి బుద్ది చెబుతామంటున్నారు ఏపీ పరిరక్షణ సమితి. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పకుంటే.. హైదరాబాద్ లోని ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మరి.. ఈ వివాదంపై ప్రదీప్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ ఇష్యూలన్ని మనకెందుకు ప్రదీప్? సింఫుల్ గా సారీ చెప్పేసి పక్కకు వచ్చేస్తే పోలా?