Begin typing your search above and press return to search.

పార్టీలో తప్ప తాగి యాంక‌ర్ చిందులు

By:  Tupaki Desk   |   10 Dec 2019 2:30 PM GMT
పార్టీలో తప్ప తాగి యాంక‌ర్ చిందులు
X
క‌థానాయిక‌ల‌కు ధీటుగా యాంక‌ర్ల‌కు జ‌నాల్లో క్రేజు పెరుగుతోంది. అందానికి అందం హాట్ అప్పీల్ తో కుర్ర‌కారు కంటికి కునుకు ప‌ట్ట‌నివ్వ‌ని యాంక‌ర‌మ్మ‌లు టాలీవుడ్ లో కోకొల్ల‌లు. ఈవెంట్ల పేరుతో ల‌క్ష‌ల్లో పారితోషికాలు అందుకుంటూ ఈ భామలు బాగానే సంపాదిస్తున్నారు. సంపాద‌న తో పాటే స‌ద‌రు యాంక‌ర్లు ల‌గ్జ‌రీ లైఫ్ కి అల‌వాటు పడుతున్నారన్న ఆరోప‌ణ ఉంది. అయితే ఇటీవ‌ల ఓ పార్టీలో అందాల యాంక‌ర‌మ్మ చేసిన ర‌చ్చ ప్ర‌స్తుతం తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్ గా మారింది.

ఇంత‌కీ ఆ పార్టీ ఏది? అంటే.. టాలీవుడ్ నిర్మాత .. నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు సి.క‌ళ్యాణ్ బ‌ర్త్ డే పార్టీలో స‌ద‌రు యాంక‌ర‌మ్మ ఓ రేంజులో చిందులేసింద‌ట‌. ఓ ఐదు నక్ష‌త్రాల హోట‌ల్లో జ‌రిగిన ఈ పార్టీలో ఫ్లూటుగా తాగి మ‌త్తులో తూలిపోతూ అభిమానుల‌కు సెల్ఫీలు ఇస్తూ చాలానే ర‌చ్చ చేసింద‌ని తెలుస్తోంది. ఇంత‌కీ ఎవ‌రీ యాంక‌ర‌మ్మ అంటే రెగ్యుల‌ర్ గా సినిమాల్లో న‌టిస్తూనే యాంక‌ర్ గానూ పెద్ద రేంజునే చేరుకుంది. త‌న‌దైన అందం చందంతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపే స‌త్తా త‌న‌కు ఉంది.

అయితే స‌ద‌రు యాంక‌ర‌మ్మ అంత ర‌చ్చ చేసిన ఈ వేడుక‌లో మెగాస్టార్ చిరంజీవి.. నంద‌మూరి బాల‌కృష్ణ లాంటి అతిర‌ధులు ఉన్నార‌ట‌. అంత పెద్ద రేంజులో జ‌రిగిన ఈ వేడుక‌లో స‌ద‌రు యాంక‌ర్ అంత డేరింగ్ గా గ‌ట్సీగా అంత ప‌ని చేసిందా? అంటూ ఒక‌టే చెవులు కొరుక్కుంటున్నారంతా. క‌ల్కి- ఆర్డీఎక్స్ 100 లాంటి ఫ్లాప్ చిత్రాల‌తో పాటు జై సింహా లాంటి హిట్ సినిమాని తీసిన సి.క‌ల్యాణ్ ప్ర‌స్తుతం బాల‌య్య హీరోగా రూల‌ర్ అనే భారీ చిత్రం నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న బ‌ర్త్ డే వేడుక ఈసారి సంథింగ్ స్పెష‌ల్ గా సాగింద‌ని తెలుస్తోంది. అయితే డీసెంట్ గా సాగాల్సిన పార్టీలో స‌ద‌రు యాంక‌ర‌మ్మ వీరంగం గురించి వాడివేడిగా చ‌ర్చ సాగింది మ‌రి.