Begin typing your search above and press return to search.

ఏంటీ అనసూయ మళ్లీ మళ్లీ ఈ రచ్చ?

By:  Tupaki Desk   |   22 July 2020 2:00 PM IST
ఏంటీ అనసూయ మళ్లీ మళ్లీ ఈ రచ్చ?
X
యాంకర్‌ అనసూయ ఈమద్య కాలంలో నెటిజన్స్‌ చేస్తున్న కామెంట్స్‌ కు ఎగ్రసివ్‌ గా సమాధానం చెప్పడంతో ఎప్పుడు మీడియాలో ఉంటుంది. ముఖ్యంగా ఆమె డ్రస్సింగ్‌ గురించి జబర్దస్త్‌ షో గురించి డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ గురించి నెటిజన్స్‌ పదే పదే ట్రోల్స్‌ చేస్తునే ఉన్నారు. ఇటీవల అనసూయ సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ తో చిట్‌ చాట్‌ చేస్తున్న సమయంలో కొందరు ఆమెను డ్రస్సింగ్‌ విషయంలో మళ్లీ విమర్శించారు. ఎప్పటిలాగే వారి విమర్శలకు అనసూయ సహనం కోల్పోయింది.

ఉత్తరాది అమ్మాయిలు ఎంతగా మోడ్రన్‌ డ్రస్‌ లు వేసుకున్నా కూడా మీరు ఎలాంటి కామెంట్స్‌ చేయరు. పెళ్లి కాని అమ్మాయిలు మోడ్రన్‌ డ్రస్‌ లు వేసుకున్నా మీకు పెద్దగా సమస్య లేదు. కాని పెళ్లి అయిన వారు మాత్రం మోడ్రన్‌ డ్రస్‌ లు వేసుకునేందుకు అనర్హులు అంటూ మీ అభిప్రాయం. మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు. మీ తల్లి.. సోదరి.. భార్య విషయంలో అలా ఆలోచించడమే తప్పు. అలాంటిది ఇతరులు కూడా మీ ఆలోచనకు తగ్గట్లుగా ఉండాలంటే ఎలా అంటూ విమర్శలు చేసింది.

సోషల్‌ మీడియాలో స్టార్స్‌ సెలబ్రెటీల అటెన్షన్‌ ను దక్కించుకునేందుకు కొందరు ఆకతాయిలు అలాంటి కామెంట్స్‌ చేస్తూ ఉంటూనే ఉంటారు. సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలనుకున్న వారు కూడా అలాంటి కామెంట్స్‌ చేస్తారు. అలాంటి వారిని పట్టించుకోకుండా ఉంటేనే మంచిది. కాని అనసూయ మాత్రం మళ్లీ మళ్లీ అలాంటి ఆకతాయిల కామెంట్స్‌ కు ఎమోషన్‌ అవ్వడం మరియు ఆగ్రహంతో వారికి కౌంటర్‌ ఇవ్వడం కామన్‌ అయ్యింది. అలాంటి వారి గురించి పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది కదా అంటున్నారు.