Begin typing your search above and press return to search.

వారందరికీ ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన అనసూయ

By:  Tupaki Desk   |   26 Aug 2022 11:03 AM GMT
వారందరికీ ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన అనసూయ
X
మరోసారి సోషల్ మీడియాలో అనసూయ హాట్ టాపిక్ గా మారింది. అమ్మను అంటే ఇలాగే ఉంటుంది అంటూ ఇండైరెక్ట్‌ గా ఎవరికో కౌంటర్ ఇచ్చిన అనసూయ వరుసగా ట్వీట్స్ చేస్తూ ఉంది. ఇటీవల ఆమె ను వయసు గురించి మాట్లాడుతూ... ఆంటీ అంటూ సంబోధిస్తూ.. బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్స్ చేసిన వారి స్క్రీన్ షాట్స్ ని షేర్ చేసింది. వాటన్నింటిని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అనసూయ పేర్కొంది.

అనసూయ చేస్తున్న ఇండైరెక్ట్‌ పోస్ట్‌ లు ఒక హీరోకు సంబంధించినవి అంటూ ఆ హీరో అభిమానులు తెగ హడావిడి చేస్తున్నారు. అనసూయ పోస్ట్ కు కాస్త ఘాటుగానే కామెంట్స్ చేస్తూ వయసు గురించి మరియు ఆమె చేస్తున్న పాత్రలు వేసుకుంటున్న డ్రస్ లు ఇలా అన్ని విధాలుగా టార్గెట్‌ చేస్తూ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ఎక్కువ శాతం మంది ఆంటీ అంటూ సంభోదిస్తూ కామెంట్స్ పెట్టడం ను కూడా ఆమె తీవ్రంగా తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.

నటిగా అనసూయ ఎన్నో రకాల పాత్రల్లో నటిస్తూ యాంకర్ గా బుల్లితెరపై సందడి చేస్తూ అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్ ను కూడా చేస్తూ సందడి చేస్తూ ఉంది. అలాంటి అనసూయ ఒక హీరో విషయంలో స్పెషల్ గా టార్గెట్ చేసినట్లుగా విమర్శలు చేస్తుంది అంటూ ఆయన అభిమానులు మొదటి నుండి కూడా అనసూయ ను టార్గెట్‌ చేసి కాస్త ఎబ్బెట్టు కామెంట్స్ ను బూతులను షేర్‌ చేస్తూ ఉన్నారు.

ఆ హీరో విషయంలో అనసూయ తగ్గడం లేదు.. అనసూయ విషయంలో ఆ హీరో అభిమానులు తగ్గడం లేదు. ఆమె ట్వీట్‌ చేసిన ప్రతి సారి కూడా తీవ్ర స్థాయిలో నెటిజన్స్ ఆమెను టార్గెట్‌ చేస్తున్నారు. ఇప్పుడు అది మరింత ఎక్కువ అవ్వడంతో అనసూయ ఫైనల్ వార్నింగ్‌ అంటూ ఇచ్చింది.

మళ్లీ ఆంటీ అని.. వయసు కు సంబంధించిన ఇతర కామెంట్స్ ఏం చేసినా కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఈ విషయంలో కొందరు అనసూయను సమర్థిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం అనసూయ కావాలని కొందరిని రెచ్చగొడుతుందేమో అనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దారి తీస్తుంది అనేది చూడాలంటే మరి కొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే. అనసూయ ఫైనల్‌ వార్నింగ్‌ కు ఆ హీరో అభిమానులు కాస్త అయినా తగ్గుతారా అనేది చూడాలి.