Begin typing your search above and press return to search.

పిక్ టాక్: స్టార్ హీరోతో అనసూయకు అంత బాండింగ్ ఎప్పుడు ఏర్పడిందో..!

By:  Tupaki Desk   |   3 Dec 2020 11:00 PM IST
పిక్ టాక్: స్టార్ హీరోతో అనసూయకు అంత బాండింగ్ ఎప్పుడు ఏర్పడిందో..!
X
స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా రాణిస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ క్రమం తప్పకుండా హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ నెటిజన్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఒక పక్క సంప్రదాయ బద్ధంగా కనిపిస్తూనే మరో పక్క గ్లామర్ షో చేస్తూ కనువిందు చేస్తుంది. అయితే ఇప్పుడు సడన్ గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తో కలిసి ఉన్న ఓ ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అందరూ మాట్లాడుకునేలా చేసింది.

విజయ్ సేతుపతితో చిరు నవ్వులు చిందిస్తున్న ఫోటోని షేర్ చేసిన అనసూయ భరద్వాజ్ ''బ్రిలియన్స్ తో బాండింగ్.. నిజంగా మక్కల్ సెల్వన్'' అంటూ తనదైన స్టైల్ లో కామెంట్ పెట్టింది. ఇందులో విజయ్ సేతుపతి భుజం మీద చేతులు వేసి అనసూయ అత్యంత సన్నిహితంగా కనిపిస్తోంది. అయితే ఈ ఫోటో ఏ సందర్భం తీసుకుంది.. విజయ్ సేతుపతితో కలిసి నటించబోతోందా అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అమ్మడికి మక్కల్ సెల్వన్ తో ఇంత బాండింగ్ ఎప్పుడు ఏర్పడిందో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా అనసూయ ప్రస్తుతం 'థ్యాంక్ యూ బ్రదర్' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె గర్భవతిగా ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తోంది.