Begin typing your search above and press return to search.

హాట్‌ యాంకర్‌ ని వదలని రౌడీస్టార్‌

By:  Tupaki Desk   |   19 Feb 2020 8:22 AM GMT
హాట్‌ యాంకర్‌ ని వదలని రౌడీస్టార్‌
X
జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ఒక వైపు బుల్లి తెరపై దుమ్ము రేపుతూనే మరో వైపు వెండి తెరపై కూడా తన నటన ప్రతిభతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు వస్తే తప్పకుండా చేస్తూ ఉన్న అనసూయ రంగస్థలం చిత్రంలోని రంగమ్మత్త పాత్ర తో గుర్తిండి పోయేలాంటి పాత్ర చేసింది. ఆ చిత్రంలోని అనసూయ నటనకు మరియు ఆమె పాత్రకు అంతా ఫిదా అయ్యారు. అందుకే అనసూయ నటిస్తున్న సినిమా అనగానే అంతా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.

గత ఏడాది విజయ్‌ దేవరకొండ నిర్మాణంలో వచ్చిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో కీలక పాత్రలో అనసూయ నటించింది. ఆ సినిమా తర్వాత కూడా పలు చిత్రాల్లో అనసూయ నటించింది. ప్రస్తుతం స్టార్‌ హీరో సినిమాలో నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో ఈ అమ్మడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ లో కీలక పాత్రకు గాను ఎంపిక అయినట్లుగా సమాచారం అందుతోంది.

ఈ ఏడాది ద్వితీయార్థంలో విజయ్‌ దేవరకొండ తన బ్యానర్‌ లో రెండవ సినిమాను నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుందట. ఆ సినిమాలో కీలక పాత్రకు గాను అనసూయను విజయ్‌ దేవరకొండ రిఫర్‌ చేసినట్లుగా తెలుస్తోంది. అనసూయ ఉంటే సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కడంతో పాటు.. అన్ని విధాలుగా పాజిటివ్‌ బజ్‌ ఉంటుందని విజయ్‌ దేవరకొండ భావిస్తున్నాడట. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో వెళ్లడయ్యే అవకాశం ఉంది.