Begin typing your search above and press return to search.

అనసూయ.. మళ్లీ మెగా కాంపౌడ్లోనే

By:  Tupaki Desk   |   10 April 2018 11:18 AM GMT
అనసూయ.. మళ్లీ మెగా కాంపౌడ్లోనే
X
నటీనటులు సినిమా కెరీర్ ముగిశాక బుల్లితెర వైపు చూస్తుంటారు. కానీ ఇటీవల కథ మారింది. బుల్లితెరపై పేరు తెచ్చుకుని సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తున్నారు కొంతమంది. ఆ ఒరవడికి శ్రీకారం చుట్టిన వాళ్లలో అనసూయ పేరు ముందు చెప్పుకోవాలి. ‘జబర్దస్త్’ కామెడీ షోతో పేరు తెచ్చుకుని.. సినిమా అవకాశాలు అందుకుందామె. అనసూయ నటించిన ‘క్షణం’.. ‘రంగస్థలం’ సినిమాలు ఆమె చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్రతో అనసూయ కెరీరే మారిపోయేలా కనిపిస్తోంది. ఆమెకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.

తాజాగా అనసూయ ఒక క్రేజీ ప్రాజెక్టులో చోటు దక్కించుకుందట. మెగా కుర్రాడు వరుణ్ తేజ్.. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కలిసి నటించబోయే మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్-2’లో ఆమె ఓ కీలక పాత్ర చేయబోతోందట. దర్శకుడు అనిల్ రావిపూడి ఆమె కోసం మంచి పాత్రే సిద్ధం చేశాడట. ‘రంగస్థలం’ తర్వాత అనసూయ ఒప్పుకున్న తొలి సినిమా ఇదే అంటున్నారు. ఒకప్పుడు అల్లు అర్జున్ మీద చేసిన కామెంట్ వల్ల మెగా ఫాన్స్ నుంచి ఆమె వ్యతిరేకత ఎదుర్కొంది. కానీ ఆ తర్వాత మెగా హీరోలే ఆమెకు అవకాశమిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ సినిమాలో అనసూయ ఒక ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చరణ్.. ఇప్పుడు వరుణ్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకంది. ఈ వరుసలోనే అనసూయకు బన్నీ కుడా ఛాన్సిస్తాడేమో చూద్దాం.