Begin typing your search above and press return to search.

'ఆచార్య'లోను అదే తరహా పాత్రలో అనసూయ!

By:  Tupaki Desk   |   3 April 2022 12:00 PM IST
ఆచార్యలోను అదే తరహా పాత్రలో అనసూయ!
X
అనసూయ ఇప్పుడు ఫుల్ బిజీ. మొన్న మొన్నటివరకూ ఆమె టీవీ కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. సినిమాల్లో కాస్త కుదురుకునే వరకూ ఆమె టీవీ కార్యక్రమాలను వదిలి పెట్టలేదు. వాటికి అడ్డురాకూడదనే ఉద్దేశంతోనే అంతకుముందు ఆమె స్పెషల్ సాంగ్స్ చేసుకుంటూ వెళ్లింది. ఆ తరువాత వరుసగా వస్తున్న అవకాశాలు .. తన పై తనకి కుదురుకున్న నమ్మకం కారణంగా ఆమె సినిమాల సంఖ్యను పెంచుకుంటూ వెళుతోంది. ఇప్పుడు ఆమె చేతిలో ఓ డజను సినిమాలు ఉండొచ్చు.

అనసూయ అంటే గ్లామర్ .. మంచి హైటూ .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపంతో ఆమె ఇట్టే ఆకట్టుకుంటుంది. తన విలనిజానికి రొమాన్స్ ను జోడించగల అవకాశం ఆమెకి ఉంది. అందువలన ఆమెతో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేయించడానికి దర్శక నిర్మాతలు కూడా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.

'పుష్ప' సినిమాలో దాక్షాయణిగా ఆమె నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులు చూశారు. 'పుష్ప 2'లోను ఆమె పాత్ర హైలైట్ కానుంది. ఆమె పాత్ర కి మంచి స్కోప్ ఉండటంతో, మరింత పవర్ఫుల్ గా ఆ పాత్రను సుకుమార్ తీర్చిదిద్దుతున్నాడని అంటున్నారు.

ఇక చిరంజీవి కథానాయకుడిగా 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనసూయ ఒక కీలకమైన పాత్రను పోషించిందట. నెగెటివ్ షేడ్స్ కలిగినదిగా ఈ పాత్ర కనిపిస్తుందని అంటున్నారు.

చాలా కీలకమైన సమయంలో ఉన్నప్పుడు హీరో పాత్రను ఇరికించే ప్రయత్నం చేసే పాత్రను అనసూయ చేసిందని అంటున్నారు. ఈ పాత్ర తనకి చాలా మంచి పేరు తీసుకుని వస్తుందని ఆమె భావిస్తోందట. ఇక 'ఆచార్య' సినిమాలోను ఆమె పాత్ర నెగెటివ్ షేడ్స్ తోనే కనిపిస్తుందని అంటున్నారు.

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ రూపొందించిన 'ఆచార్య'లో కథానాయికగా కాజల్ కనిపించనుంది. ఇక మరో జంటగా చరణ్ - పూజ హెగ్డే సందడి చేయనున్నారు. ఈ నెల 29న రానున్న ఈ సినిమాలో అనసూయ పాత్ర కూడా చాలా ప్రత్యేకతను .. ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుందని సమాచారం.

ఆమె మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట. అందువల్లనే ఆమె లుక్ ను రివీల్ చేయలేదని అంటున్నారు. ఈ పాత్ర కోసం ఆమె అందుకున్న పారితోషికం 25 లక్షలని చెప్పుకుంటున్నారు. అనసూయ వెళుతున్న రూట్ చూస్తుంటే, మున్ముందు ఆమె వరలక్ష్మి శరత్ కుమార్ మాదిరిగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.