Begin typing your search above and press return to search.

'పుష్ప‌'లో దాక్ష‌య‌ని పారితోషికం ఎంతంటే?

By:  Tupaki Desk   |   24 Dec 2021 1:30 AM GMT
పుష్ప‌లో దాక్ష‌య‌ని పారితోషికం ఎంతంటే?
X
పాన్ ఇండియా చిత్రం `పుష్ప దిరైజ్` ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. సినిమాకి డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ వ‌సూళ్ల ప‌రంగా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. బ‌న్నీ వ‌న్ మ్యాన్ షో సాగిపోతుంది. ఇందులో దాక్ష‌య‌ని పాత్ర‌లో హాట్ యాంక‌ర్ అన‌సూయ క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. ఓ అగ్ర హీరో చిత్రంలో తొలిసారి నెగిటివ్ రోల్ పోషించే అవ‌కాశం ద‌క్కింది. పాత్ర వేగాన్ని బ‌ట్టి సినిమాలో దాక్ష‌య‌ని రోల్ కీల‌కం అని తెలుస్తోంది.

మొద‌టి భాగంలో ఊహించినంత లేదు గానీ..రెండ‌వ భాగంలో సునీల్-అన‌సూయ పాత్ర‌లు మ‌రింత కీల‌కంగా ఉంటాయ‌ని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కోసం అన‌సూయ భారీగానే ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ప‌ది రోజుల షూటింగ్ షేడ్యూల్ కి గాను 12 ల‌క్ష‌లు తీసుకుందిట‌. గ‌తంలో `రంగ‌స్థ‌లం`లో రంగ‌మ్మ‌త్త పాత్ర కోసం 5 ల‌క్ష‌లు ఛార్జ్ చేసింది. ఇప్పుడు అమ్మ‌డి పారితోషికం రెట్టింపు అయిన‌ట్లు తెలుస్తోంది.

సినిమా ప‌రంగా అన‌సూయ లైన‌ప్ చూస్తే..ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది నిర్మిస్తున్న ఓ చిత్రంలో న‌టిస్తుంది. అలాగే `పేప‌ర్ బోయ్` ద‌ర్శ‌కుడు జ‌య‌శంక‌ర్ తెరెక్కిస్తోన్న మ‌రో చిత్రంలో న‌టిస్తుంది. ఇందులో అన‌సూయ లీడ్ పాత్ర పోషిస్తుంది. న‌టిగా మంచి పేరు తీసుకొచ్చే సందేశాత్మ‌క చిత్ర‌మ‌ని టాక్ వినిపిస్తుంది.