Begin typing your search above and press return to search.

అలా ఉంటే బికినీకి సైసై అంటున్న రంగమ్మత్త

By:  Tupaki Desk   |   29 April 2020 2:20 PM IST
అలా ఉంటే బికినీకి సైసై అంటున్న రంగమ్మత్త
X
అదేంటో బికినీ అనగానే చాలామంది తప్పుగా చూస్తారు కానీ అసలు బికినీ వేసి మెప్పించాలంటే అందుకు పర్ఫెక్ట్ షేప్ ఉండాలి. బాన పొట్ట.. నడ్డితో కనుక బికినీ వేస్తే ఒంటిపై ఆ బికినీ సిగ్గుతో బిక్క చచ్చిపోతుంది.. చూసిన జనాలు పుటుక్కున చస్తారు. అయితే ఈ విషయం కొంతమందికి తెలియక బికినీలను చిత్రవధకు గురిచేస్తారు. తమను ఇలా వాడేకంటే బండకేసి బాదితేనే మేలని అవి భావిస్తాయి. 'పర్ఫెక్ట్ షేప్ ఉండాలి' అంటే చాలు కొందరు పనిలేని మేథావులు ఎందుకు ఉండాలి.. మీరు బాడీ షేమింగ్ చేస్తున్నారు అంటూ దాడికి దిగుతారు. సరే ఈ హంగామా పక్కన పెడితే హాట్ యాంకర్ అనసూయ తాజాగా బికినీ ధరించడం పై తన అభిప్రాయం వెలిబుచ్చింది.

తనను కొందరు ట్రోల్ చేస్తుంటారని.. నిజానికి వారికి తనగురించి తెలియదని.. తెలిస్తే అలా ఎవరూ ట్రోల్ చేయరని చెప్పుకొచ్చింది. ఇక సినిమాలలో గ్లామరస్ గా కనిపించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చింది. బికినీ గురించి మాట్లాడుతూ తనకు బికినీ ధరించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని అయితే బికినీ ధరించడానికి సూట్ అయ్యే బాడీ తనకుఇప్పుడు లేదని స్పష్టం చేసింది. బికినీ కి సూట్ అయ్యే ఫిట్ బాడీ ఉంటే తప్పకుండా బికినీ వేసుకుంటానని తెలిపింది. కరెక్ట్ గా చెప్పింది కదా...!

బుల్లితెరను గ్లామరస్ యాంకర్ గా ఏలిన అనసూయ వెండితెరపై కూడా అంతకంటే గ్లామరస్ గా కనిపించాలని.. బాలీవుడ్ భామలు మలైకా అరోరా.. మందిరా బేడి.. శిల్పా శెట్టి ల తరహాలో అనసూయ కూడా ఓ రోజు బికినీ అవతార్ లో కనిపించాలని కోరుకుందాం. ఇక విమర్శకుల సంగతి అంటారా..? ఎప్పుడూ ఏడ్చేవాడిని బ్రహ్మదేవుడు కూడా బాగు చేయలేడని ఒక సామెత ఉంది. వాళ్ళను బాగు చెయ్యడం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు.. పూరి జగన్నాధ్ లాంటి కళా పిపాసుల వల్ల కూడా కాదు.